BJP Press Conference at party headquarters in New Delhi: ఢిల్లీ: కేంద్రంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భారతీయ జనతా పార్టీ (BJP) భావిస్తోంది. గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం లోక్ సభ ఎన్నికలకుగానూ 195 అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ నేత వినోద్ తావడే, అర్జున్ పాండేతో కలిసి శనివారం సాయంత్రం 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బరిలో నిలవనున్న నేతల వివరాలు వెల్లడించారు. తెలంగాణలో సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, బీజేపీ తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలను మరోసారి అదే స్థానం నుంచి బరిలోకి దించుతోంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు మరోసారి బీజేపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది.
- కరీంనగర్ - బండి సంజయ్
- నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
- జహీరాబాద్ - బీబీ పాటిల్
- మల్కాజ్ గిరి ఈటల రాజేందర్
- సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
- భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
- హైదరాబాద్ - మాధవీలత
- చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - పి. భరత్ (ఎస్సీ)
- కరీంనగర్ - బండి సంజయ్
- నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
- జహీరాబాద్ - బీబీ పాటిల్
- మల్కాజ్ గిరి ఈటల రాజేందర్
- సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
- భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
- హైదరాబాద్ - మాధవీలత
- చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - పి. భరత్ (ఎస్సీ)
లోక్‌సభ ఎన్నికలకు గానూ ఆయా రాష్ట్రాల నుంచి బీజేపీ తొలి జాబితా సీట్ల వివరాలిలా ఉన్నాయి. యూపీలో 51 సీట్లు, పశ్చిమ బెంగాల్ 20 సీట్లు, మధ్య ప్రదేశ్ 24 సీట్లు, గుజరాత్ 15 సీట్లు, రాజస్థాన్ 15, కేరళ 12 సీట్లు, తెలంగాణ 9 సీట్లు, అసోం 11, ఝార్ఖండ్ 11, ఛత్తీస్ గఢ్ 11, ఢిల్లీ 5 సీట్లు, జమ్మూ కాశ్మీర్ 2, ఉత్తరాఖండ్ 2, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్ డయ్యూ 1 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
వారణాసి నుంచి ప్రధాని మోదీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, దిబ్రూగడ్ సర్బానంద్ సోనోవాల్, బస్తర్ మహేష్ కశ్యప్, ఛాందిని చౌక్ ప్రదీప్ ఖండేల్ వాల్, నార్త్ ఈస్ట్ మనోజ్ తివారీ, న్యూఢిల్లీ సుశ్రి బాసురీ స్వరాజ్, వెెస్ట్ ఢిల్లీ కమల్ జీత్ షెరావత్, నార్త్ గోవా శ్రీపాద్ నాయక్,
బీజేపీ లోక్ సభ అభ్యర్థులలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించారు. యువతకు 47 సీట్లు, మహిళలకు 28 సీట్లు, ఎస్సీలకు 27 సీట్లు, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు.