KTR In Assembly :
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్ లు మార్చడం కాదు.. అనుకున్న లక్ష్యం ప్రకారం పనిచేయాలన్నారు. అన్ని వర్గాల వారి కలలు తెలంగాణలో నెరవేరుతున్నాయన్నారు. ప్రతిపక్షాల కలలు కల్లలవుతున్నాయన్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ దేశంలోనే టాకింగ్ పాయింట్ అన్నారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ సలామ్ అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. 65లక్షల మంది రైతులకు రూ.65వేల కోట్లు జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు.
దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు.. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరని విమర్శించారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి.. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా అని విపక్ష నేతల్ని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారింది.. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి.. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామని కేటీఆర్ లెక్కలు వివరించారు.
దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉంది ధీమా వ్యక్తం చేశారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పని చేయాలి.. యూఎన్‌వో కూడా రైతుబంధును ప్రశంసించింది.. పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్‌వన్‌గా ఉన్నాం .. మేము రైతురాజ్యం కావాలంటే, బీజేపీ వాళ్లు కార్పొరేట్ రాజ్యం కావాలని అంటున్నారు.. గుజరాత్‌లో పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు.. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల, అటువెళ్లాక పూర్తిగా మారిపోయారని విమర్శించారు.
ప్రతిపక్షమంటే పక్షపాతంగా వ్యవహరించాలని, ఎప్పుడూ విమర్శ చేయాలనుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంచి చేసినపుడు అప్పుడప్పుడైనా సమర్థించాలని అన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్.. దేశానికి రాష్ట్రం ఆదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వంలో పైరవీకారులకు చోటు లేదని, పథకాల కోసం లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్య తీరిపోయిందని, నిధుల వరద పారుతోందని, నియామకాల కల కూడా సాకారమవుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అనుమానాలను పటాపంచెలు చూస్తూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.