KTR Comments : బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని  అలా  ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హితవు పలికారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.  


బిఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదన్నారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూపించారన్నారు.   కొంతమంది చేయి గుర్తుకు వేసిన పెద్ద మనుషులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందన్నారు.  గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచింది.119 సీట్లల్లొ 39 గెలిచినం అంటే మూడోవంతు గెలిచినం. మిగతా 14 స్తానాల్లో కేవలం వందల్లో వేలల్లో ఓడామని..   అవికూడా గెలిచివుంటే పరిస్థితి వేరుగా వుండేదన్నారు. 


పరిపాలన మీద ద్రుష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అన్నారు.  పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గాజరగలేదు. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయామన్నారు.  నియోజవర్గాల్లో ఎమమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడంసరికాదు.. ఈ పదేండ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు.  ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా  నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల వోటరుకు కార్యకర్తకు లింకు తెగిందన్నారు.  రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయామన్నారు.  పెన్షన్లు కూడా కొత్తవి ప్రతినియోజవర్గంలో 15 వేలకు వరకు కొత్తగా ఇచ్చామనికాన చెప్పుకోలేకపోయామన్నరాు.  వందలో ఒక్కరికి రాకుంటే అదే నెగెటివ్ గా ప్రచారమైందన్నారు.  దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు వోపికపట్ట లేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారు. ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత కానవచ్చిందన్నారు. 


రైతుబందు తీసుకున్న సామాన్య రైతుకూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే వొప్పుకోలేదు.  వీటితో పాటు ఇంకా కొన్ని  కారణాలున్నాయని తెలిపారు. కాగా…అమలు చేసిన పథకాల ద్వారా  భవిష్యత్తులో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనావేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలలో తేలిందని కేటీఆర్ వివరించారు. రోజువారిగా జరుగుతున్న సమీక్షాలో వెల్లడౌతున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నివేదిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. నూతన కాంగ్రేస్  ప్రభుత్వానికి  సంపూర్ణ సహకారం అందిద్దామనే సదుద్దేశంతో వున్న తమను కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం రెచ్చగొడుతున్నదని కెటిఆర్ వివరించారు. 
 
 కొత్తగా ప్రబుత్వంలోకి వచ్చిన  వాళ్లు కుదురుకునేందుకు ప్రయత్నం చేయడం మానేసి ప్రతిపక్షంలో వున్న మనలను రెచ్చగొట్టుకుంటూ కాలం ఎల్లదీయాలనే ఎత్తుగడ  వేసిందన్నారు.   గెలుస్తామనే విశ్వాసం లేని స్థితిలో, అధికారం కోసం అర్రులు చాచి, అలవికాని హామీలిచ్చి నేడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేత ప్రతాల పేరుతో ప్రజల ద్రుష్టి మల్లించేందుకు కాంగ్రేస్ పార్టీ నాటకాలాడుతున్నదన్నారు. వీరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కెటిఆర్ అన్నారు.  కెసిఆర్ తయారుచేసిన జగదీశ్ రెడ్డి, తదితర తమ వంటి కార్యకర్తలే అసెంబ్లీలో ధీటుగా తిప్పికొడితే..త్వరలో  స్వయంగా కెసిఆరే అంసెంబ్లీకి వస్తే పరిస్తితి ఎట్లా వుంటుందో వూహించలేరన్నారు.  
 
ఓటమి కొత్తేం కాదని., అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని స్పష్టం చేసిన కెటిఆర్…పదేండ్ల పాటు విరామమెరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్ కు పోయిందే తప్ప షెడ్డులోకి పోలేదని చమత్కరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు తమ సత్తాచాటాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పిలుపునిచ్చారు.