Kodandaram is ready to join the cabinet :  కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరతామని టీజేఏస్ చీఫ్ కోదండరాం ( TJS Chief ) స్పష్టం చేసారు.  తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు  ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు.   ప్రభుత్వంలో , ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని  రాహుల్ గాంధే స్వయంగా హమీ ఇచ్చినట్లు ఏబీపీ దేశం కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తెలిపారు. పదవులు బాధ్యత తప్ప తమకు అవేమి అధికారాన్ని అనుభవించే అవకాశం కాదని చెప్పారు. తప పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలిపారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి పోటీ చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన ఆలోచనల్ని..సేవల్ని తెలంగాణ అభ్యున్నతి కోసం వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ముందు నుంచీ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంమలో ఆయనకు  ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.             


తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.  ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ  రెండు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి కోదండరాంకు  ఇచ్చేలా హైకమాండ్ కు రేవంత్  సిఫారసు చేశారని చెబుతున్నారు.  వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు.   రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయనను మంత్రిని చేయాలని కోదండరాం అనుకుంటున్నారని చెబుతున్నారు.                                


తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర కీలకం. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది. తర్వాత కోదండారంకు పెద్దగా ఆదరణ లభించలేదు. బీఆర్ఎస్‌గా  మారిన టీఆర్ెస్ తరపున  పని చేయడానికి అంగీకరించలేదు.  కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఆయన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019ba కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.


పదవుల కోసం అయితే కేసీఆర్ వెంటే ఉండేవారని.. ఆయన తెలంగాణ బాగు కోసమే పని చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కోదండరాంను మంత్రిని చేస్తే.. బీఆర్ఎస్ పై నైతికంపై పైచేయి సాధించినట్లవుతుంది. కోదండరాం కూడా తెలంగాణ  కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.