KTR On Formula Case: ఈ కార్ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారు.. 16 బడ్జెట్ పెట్టీ,17 నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తరవాత మీడియా ప్రితనిధులతో చిట్ చాట్ నిర్వహించారు. తనపై కేసుల విషయంలో ప్రతి బడ్జెట్ సమావేశంలో ఇలాగే చేస్తారన్నారు. ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్ రేస్ కేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను చెప్తానన్నారు. పోటీలు ఆపేయడం వల్ల భారీగా నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు 200 కోట్లు పెట్టీ ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారు.. దీనివల్ల లాభం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మొగోడు ఒలింపిక్స్ పెడుతానంటున్నాడు దానికి లక్ష కోట్లు కావాలని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి కేసీఆర్ హాజరు
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరవుతారని.. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. అయితే కేసీఆర్ స్థాయి వేరని.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు ఎవరూ సరిపోరన్నారు.కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఓ కుమారుడికి తన ఆలోచన అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
మోడీని మంచోడనకపోతే జైల్లో వేస్తారు !
మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని.. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడని కేటీఆర్ర వ్యాఖ్యానించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందు పడి కృషి చేసింది మేము, కానీ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశాం.. అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో నడవటం లేదు.. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. అందుకే ఆయనది నడవటం లేదు... ఎక్కే విమానం దిగె విమానం తప్ప చేసేది ఏమీ లేదని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
భారీ టీడీఆర్ స్కామ్‌కు తెర లేపుతున్న రేవంత్
రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని ఆరోపించారు.
Also Read: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు