KTR said that no one will get majority at the centre :  లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో  బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నమ్మకంగా ఉన్నారు.  ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ .. లోక్ సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చన్నారు. కేంద్రంలో అటు కాంగ్రెస్  కూటమికి.. ఇటు ఎన్డీఏ కూటమికి మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. అందుకే బీఆర్ఎస్, పది పన్నెండు సీట్లలో గెలిస్తే.. కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తానే ఎంపీ అభ్యర్థి అన్నట్లుగా పోరాడాలని సూచించారు. 


అంబేద్క‌ర్, ఫూలే మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో  పెట్టింది కేసీఆరే 


అంబేద్క‌ర్, ఫూలే మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేసింది కేసీఆర్ అని ఘంటా ప‌థంగా చెప్పొచ్చునని కేటీార్ అన్నారు.   1008 గురుకుల పాఠ‌శాల‌ల‌ను కేసీఆర్ స్థాపించారు. గురుకులాల్లో ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌క్షా 20 వేల చొప్పున‌ ఖ‌ర్చు పెట్టి చ‌దివించారు. ప్ర‌పంచంతో పోటీ ప‌డే పౌరులుగా గురుకుల విద్యార్థుల‌ను తీర్చిదిద్దారు.విద్య మాత్ర‌మే కాదు.. బీసీల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేశారు. రూ. 11 వేల కోట్ల‌తో గొర్రెల పెంపంకం అమ‌లు చేశారు. మ‌త్స్య‌కారుల‌కు రూ. 30 వేల కోట్ల‌తో మ‌త్స్య సంప‌ద సృష్టించారు. నేత‌న్న‌కు చేయూత‌, చేనేత మిత్ర లాంటి మంచి కార్య‌క్ర‌మాలు తీసుకొచ్చారు. చేతి వృత్తుల‌కు, కుల‌వృత్తుల‌కు కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డారు. 


బీసీలకు ఎక్కువ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు ఇచ్చాం ! 


2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే ఎక్కువ బీసీల‌కు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించ‌గా, మిగ‌తా 12 సీట్ల‌లో 6 సీట్లు బీసీల‌కు కేటాయించారు. ఇలా 50 శాతం సీట్ల‌ను బీసీల‌కు కేటాయించ‌డం కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైంది. ఫూలే జ‌యంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు. కానీ ఆయ‌న ఆశ‌యాల‌ను కొన‌సాగించే విధంగా చేతల్లో చేసి చూపించిన ఒకే ఒక్క నాయ‌కుడు కేసీఆర్ అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.                              


ప్రతి కార్యకర్త ఎంపీ అభ్యర్థిగా పోరాడాలి  !                    


డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కేసీఆర్ ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేశారు, ద‌ళిత బంధు అమ‌లు చేశారు. అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ పేరిట‌ ఒక్కొక్క ద‌ళిత విద్యార్థికి రూ. 20 ల‌క్ష‌లు ఇచ్చి విదేశాల్లో చ‌దువుకునేందుకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ దేశంలో ద‌ళితుల‌కు ఇలా ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం ఇస్తున్నారు కేసీఆర్. మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా క్యామ  మల్లేష్‌ను గెలిపిద్దాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.