Actor Sayaji Shinde Hospitalised: ప్రముఖ నటుడు షాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిని వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేస నాళాల్లో బ్లాక్స్‌ ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్‌ కానున్నారు. కాగా గతంలోనూ ఆయన ఛాతీనొప్పికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. షాయాజి సిండే కొద్ది రోజుల క్రితమే ఆస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు.


దీంతో వెంటనే ఆయనకు అత్యవసర చికిత్స అందించి గుండె పరీక్షలు చేశామన్నారు. టెస్టుల్లో గుండెకు రక్తం సరఫరా చేసే సిరలు ముసుకుపోయాయి. దీంతో ఆయనకు ఆంజియోప్లాస్టి చేశామన్నారు. పరిస్థితి విషమించకముందే ఇన్‌టైం చికిత్స అందించామని, దీంతో ఆయనకు ప్రమాదం తప్పిందన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్‌ అవుతారని చెప్పినట్టు బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కాగా షాయాజీ షిండే తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, భోజ్‌పూరి, తమిళ, కన్నడలో అనేక సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక తెలుగులో ఆయన గుడుంబా శంకర్‌ ఆంధ్రుడు. అతడు పోకిరి, దుబాయ్‌ శ్రీను, ఆట, లక్ష్మి, అరుంధతి, దూకుడు, బిజినెస్‌మెన్‌ ఇలా స్టార్‌ హీరో చిత్రాల్లో విలన్‌గా నటించారు. అలాగే పలు చిత్రాల్లో తండ్రి పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.


ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: