Jr NTR Lands in Mumbai: మ్యాన్‌ ఆప్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ యాక్షన్‌ మోడ్‌లోకి దిగపోతున్నాడు. 'వార్‌ 2' సెట్‌లో ఎంట్రీకి అంతా సిద్ధమైంది. ఇక తలపడటమే మిగిలిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం 'దేవర'. దీనితో పాటు 'వార్‌ 2' మూవీకి కూడా సైన్‌ చేశాడు. ఈ చిత్రంతోనే తారక్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనిపై ప్రకటన వచ్చిన చాలా రోజులు అవుతున్నా ఇంకా అతడు సెట్‌లో అడుగుపెట్టలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ టైం వచ్చింది. వార్‌ 2 షూటింగ్‌ కోసం అతడు నిన్న ముంబై పయనమయ్యాడు. అక్కడ ముంబై ల్యాండ్‌ అయిన తారక్‌ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తారక్‌ ముంబైలో దిగగానికి ఎయిర్‌పోర్టు, అక్కడ తారక్‌ దిగిన నివాసం ముందు సందడి వాతావరం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్‌ అవుతున్నాయి.


ఇందులో తారక్‌ కొత్త లుక్‌లో కనిపించాడు. ఫుల్‌ షాట్‌ హెయిర్‌తో కనిపించాడు. మొత్తానికి 'వార్‌ 2'కి మాత్రం ఎన్టీఆర్‌ లుక్‌ మార్చేశారని అనిపిస్తుంది. దేవరలో గడ్డం, హెయిర్‌తో కనిపించిన ఎన్టీఆర్‌ ఈ వీడియోలో షాట్‌ హెయిర్‌తో కనిపించాడు. మొత్తానికి ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. ఇక 'వార్‌ 2' సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్స్‌, పోస్టర్స్‌ అప్‌డేట్స్‌ మిగిలున్నాయి. ఈ హై వోల్టేజ్‌యాక్షన్‌ డ్రామాలో తారక్‌ పాత్ర ఎంటనేది ఇప్పుడు ఆసక్తిని సంతరించుకుంది. ఈ రోజు నుంచే తారక్‌ 'వార్‌ 2' షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్‌ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. అయితే ఎన్టీఆర్‌ 'రా ఏజెంట్‌'గా(Raw Agent) కనిపించనున్నాడని ఇన్‌సైడ్‌ సర్కిల్లో టాక్‌. మొత్తం ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ 100 రోజుల కాల్ షీట్స్‌ ఇచ్చాడని తెలుస్తోంది. 






'వార్‌ 2' వచ్చేది అప్పుడే


ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ ‘వార్’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. కానీ దీని సీక్వెల్ బాధ్యతను మాత్రం 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తీసుకున్నాడు. ఇక సినిమా షూటింగ్‌ను వీలైనంద త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది థియేటర్లోకి తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ను కూడా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 2025 ఆగస్ట్ 14వ తేదీన ‘వార్ 2’ రిలీజ్‌ చేస్తామని చెప్పారు. ఇక ఈ చిత్రంలో హృతిక్, ఎన్టీఆర్‌కి సమానమైన ప్రాధాన్యత ఉంటుందట. 'వార్‌ 2' యాక్షన్, ఫైట్స్ మొదటి భాగాన్ని మించి ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా హృతిక్, ఎన్‌టీఆర్‌ను ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్ చేస్తుంటే చూడాలని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలో ఎన్‌టీఆర్‌కు ఇదే మొదటి చిత్రం కాబట్టి ‘వార్ 2’పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.