Prabahs Raja Saab Movie Will Give a Visual Feast: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాజాసాబ్'. నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంతా షాక్ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఈ హీరో మీడియం బడ్జెట్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు. మరోవైపు ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అయ్యిందా? అని అనుమానాలు కూడా వచ్చాయి. ఈ చిత్రంపై ఎన్ని రూమర్స్ వచ్చినా ఏ రోజు మారుతి నోరువిప్పలేదు. అధికారిక ప్రకటన ఎలాంటి అప్‌డేట్, ప్రచారం లేకుండానే సైలెంట్‌గా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు.
ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్కొ అప్‌డేట్ వదులుతూ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. టైటిల్, ఫస్ట్‌లుక్ ఇలా కొన్ని అప్‌డేట్స్ ఇస్తూ హడావుడి మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా జానర్ ఏంటీ అనేది క్లారిటీ లేదు. అయితే మారుతి సినిమాలంటనే వినోదం. ఆయన చిత్రాల్లో హీరోలతో కామెడీ చేయించి నవ్విస్తాడు. ఇక ప్రభాస్‌తో కూడా కామెడీ చేయిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా రాజాసాబ్ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని మారుతి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు మందుకు తీసుకురాబోతున్నాడట. ఇక ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే ఊరమాస్‌గా కనిపించాడు. ఇక ప్రభాస్ లుక్ చూస్తుంటే కూడా ఇది పూర్తి వినోదాత్మక చిత్రమనుకుంటున్నారు.
'రాజా సాబ్' లో హారర్ కోణం
కానీ ఈ సినిమాతో మారుతి కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమాకు హారర్ జానర్ టచ్ చేశాడట. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో మధ్యలో హారర్‌తో భయపెడతాడట. ఇందుకోసం 'రాజాసాబ్'లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ ఎలిమెంట్స్ జోడించి విజువల ఫీస్ట్ ఇవ్వబోతున్నాడట. రాజాసాబ్‌తో మారతి ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడట. సెకండ్ హాఫ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని, ఆడియన్స్ అంతా థ్రిల్ అవుతారంటూ ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ మారుతికి మంచి విజువల్ సైన్స్ ఉన్న ఆయన ఎప్పుడు దీన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు ఆయన యానిమేటర్‌లో స్పెషల్ కోర్స్ తీసుకున్నారు. కానీ, ఆయన ఇంతవరకు తన విజువల్స్ సైన్స్ ఏ సినిమాలో చూపించలేదు. ఆ అవకాశం కూడా రాకపోవడంతో పెద్దగా వాడలేకపోయారట. అయితే ఈ సారి రాజాసాబ్‌కు ఆ చాన్స్ వచ్చింది.
ఇక ఈ చిత్రంలోనే తన విజువల్ సైన్స్ చూపించి అందరిని సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ చిత్రంలో హారర్ జానర్ జోడింది దానికి అదిరిపై విజువల్స్ ఇవ్వబోతున్నాడట. ఇది ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతి ఇస్తుందని, హారర్‌కి ఈ రేంజ్‌లో గ్రాఫిక్స్ కూడా వాడతారా? అనేంతగా ఆయన 'రాజాసాబ్'ను తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుతం ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నిన్నటి ఈ సినిమాను పెద్దగా పట్టించుకోని వారు ఇప్పుడు రాజాసాబ్ గురించి చర్చించకుంటున్నారు. తనదైన విజువల్స్ సైన్స్‌తో మరుతి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా? అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో మారుతి కాస్తా రిలాక్స్‌డ్‌గా ఉన్నాడు. ఎందుకంటే ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్ని రిలీజ్ అయ్యాకే 'రాజాసాబ్'ను విడుదల చేయాలని చూస్తున్నాడు. అప్పటివరకు తొందరేం లేదు అన్నట్టుగా ఉన్నాడు. అందుకే షూటింగ్‌ని కూడా చాలా స్లో స్లోగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటుండగా ఈ షెడ్యూల్‌లో సంజయ్ దత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.