KTR Blue Tick : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, కీలక మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ఉన్న వెరీఫైడ్ ట్యాగ్ మాయం అయింది. కేటీఆర్ ట్విట్టర్ ఖాతా గతంలో కేటీఆర్ టీఆర్ఎస్ @KTRTRS అని ఉండేది. కానీ టీఆర్ెస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చినందున.. తన ట్విట్టర్ ఖాతాలోని పేరును కూడా @KTRBRSగా మార్చుకోవాలని అనుకున్నారు. ఆ ప్రకారం ట్విట్టర్ బయోలో పేరు మార్చుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన వెరీఫైడ్ హోదా మిస్ అయింది. గతంలో వెరీఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బ్లూటిక్ ఎగిరిపోయింది.
ప్రస్తుకం కేటీఆర్ ఖాతా నాన్ వెరీఫైడ్ ఖాతాగానే చూపిస్తోంది. ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మాస్క్.. వెరీఫైడ్ ఖాతాలకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం బ్లూ ట్విట్టర్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. కొత్తగా బ్లూటిక్ కావాలనుకునేవాళ్లు డబ్బులు కట్టాలి. పాతవారు ఇప్పటికైతే కట్టాల్సిన పని లేదు . కానీ వారు ఎప్పుడైనా తమ ట్విట్టర్ బయోలో పేరు మార్చుకుంటారో అప్పుడు.. వారి వెరీఫైడ్ హోదా కూడా మాయం అవుతోంది. మళ్లీ ఈ వెరీఫైడ్ ట్యాగ్ కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో తెచ్చిన మార్పుల కారణంగా... మళ్లీ వెరీఫైట్ ట్యాగ్ రావడానికి సమయం పడుతుందని చెబుతున్నారు.
ట్విట్టర్‌లో గందరగోళ పరిస్థితులు - వెరీఫైడ్ ఖాతాల్లో అనేక రకాలు
ప్రస్తుతం ట్విట్టర్ లో చాలా వరకూ ఉద్యోగుల్ని తొలగించారు. ఈ కారణంగా ఎలాంటి ప్రాసెస్ అయినా ఆలస్యంగా నడుస్తోంది. ట్విట్టర్ టీం అంత త్వరగా స్పందించడం లేదు. అయితే ఇటీవల ట్విట్టర్ విధానంలో మస్క్ మార్పులు తెచ్చారు. గోల్డ్ కలర్ టిక్ లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ విభాగాకు విడిగా గుర్తింపు ఇస్తున్నారు. ఇదంతా గందరగోళంగా మారింది. అందుకే... ట్విట్టర్ వెరీఫైడ్ ఖాతాల విషయంలో.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ హ్యాండిల్స్ లో పార్టీ పేరు మార్చినా రాని ఇబ్బంది
టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నింటినీ టీఆర్ఎస్‌కు బదులు బీఆర్ఎస్ అని మార్చారు. అయితే ఆ హ్యాండిల్స్‌కు వెరీఫైడ్ హోదా మిస్ కాలేదు. కానీ ఆ ఇబ్బంది కేటీఆర్ అకౌంట్‌కు మాత్రమే వచ్చింది. కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అనేక మంది ఆయనను సమస్యల అంశంపై విజ్ఞప్తులు చేస్తూ ఉంటారు. వెరీఫైడ్ బ్లూటిక్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.