KTR predicted that Revanth Reddy will join   BJP :  లోక్ సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని కేటీఆర్ ప్రకటించారు.  అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా ప్రధాని మోదీని బడే భాయ్ అంటున్నారన్నారు.  జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదని కేటీఆర్ గుర్తు చేశారు. రూ.2500 కోట్లను ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపారన్నారు.  జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.  


ఈ రోజు కాంగ్రెస్ కు బీజేపీని ఆపే దమ్ము లేదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి విచిత్రంగా ఉందని.. అక్కడా రాహుల్ గాందీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటారన్నారు.  అక్కడ అదానీ మంచోడు కాదు అంటే రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడని..  అక్కడ రాహుల్ గాందీ,  గుజరాత్ మాడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మాడల్ బాగుందని రేవంత్ అంటుండని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు దాటవన్నారు. బీజేపీలో చేరుతారని విమర్శలు చేిసనా .. రేవంత్ అడ్డగోలుగా మాట్లాడారు కానీ.. తన జీవితమంతా కాంగ్రెస్ లో నే ఉంటానని ఎప్పుడూ చెప్పలేదన్నారు.  ఎందుకంటే ఎన్నికల తర్వాత తన మనుషులతో బిజెపిలో చేరుతారన్నారు. 
 
మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్ లకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశఅనించారు.  డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడటం లేదు  జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడని ఆరోపించారు.  కరెంటు  , రైతుబంధు ఇవ్వడానికి హామీలు అమలు చేయకుంా..  ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. అధికారం నీ చేతల్లో ఉంది ఏం చేస్తావో చెయ్..  తప్పులు చేసిన వాళ్ళపై  చర్యలు తీసుకో అని సవాల్ చేశారు.  ఆయనకు ముఖ్యమంత్రిగా అసలు పని చేసే తెలివి లేదన్నారు. 


బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు దానం నాగేంద‌ర్. ఒక‌టే మాట చెబుతున్నా. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు ఉంటాయి. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఖ‌త‌మై పోతారు. అధికారం కోసం ఆశ‌ప‌డి, గెలిపించిన ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు దానం. ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మాండ‌మైన నిర్ణ‌యం తీసుకుని తీర్పు ఇస్తార‌నే విశ్వాసం ఉంది. దానం అవ‌కాశవాద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. ఆనాడు ఆసిఫ్‌న‌గ‌ర్‌లో దానం నాగేంద‌ర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పున‌రావృతం కాబోతోందన్నారు. 


రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం మంచిది కాదు.. అక్క‌డ ఓ కాలు, ఇక్క‌డ ఓ కాలు వేస్తే ఎటు కాకుండా అయిత‌ది. దానంను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశాం. దానం నాగేంద‌ర్‌ను ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నాం. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు స్పీక‌ర్ లోనైతే, వ‌దిలిపెట్ట‌కుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం.. దానంను అన‌ర్హుడిగా చేసేదాకా పోరాడుతం. ఖైర‌తాబాద్‌లో మూడు, నాలుగు నెల‌ల్లో ఉప ఎన్నిక వ‌స్తుంది. దానికి త‌యారుకావాలి. ద్రోహం చేసిన నాయ‌కుల‌కు బుద్ది చెప్పాల‌ని మ‌న‌వి చేస్తున్నా. సికింద్రాబాద్‌లో పోటీ మ‌న‌కు కాంగ్రెస్‌తో లేదు. అది మూడో స్థానంలో ఉంది. దానంను ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. మ‌న‌కు పోటీ బీజేపీతోనే అని కేటీఆర్ పేర్కొన్నారు.