KTR :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరగడం అనుమానమేనని మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు. వచ్చే నెల పదో తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో జరుగుతాయని లేకపోతే పార్లమెంట్ తో పాటు మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయన్నారు. ఏదైనా పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత వస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందనుకుంటున్నారని అందుకే జమిలీ ఎన్నికల పేరుతో ఆలస్యం చేయాలనుకుంటున్నారని కేటీార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


ఇటీవలి కాలంలో జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. కానీ కమిటీ ఎప్పటిలోపు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. ముందస్తు ఎన్నికలు జరగబోవని కేంద్ర  మంత్రి అనురాగ్  ఠాకూర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు జరగకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేలా రాజ్యాంగ సవరణ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


అసెంబ్లీ టికెట్ల కోసం తెలంగాణ బీజేపీలో తీవ్ర పోటీ- వారంలో 6 వేల ‌అప్లికేషన్లు- దరఖాస్తు చేయని ఎంపీలు


ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు పెడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. పెట్టే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కోవింద్ కమిటీ ఎప్పుడైనా నివేదిక ఇవ్వవొచ్చని అంటున్నారు. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే.. ఐదు రకాల రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని .. ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ లో తెలిపింది. అందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ పార్లమెంట్ సమావేశాల ఎజెండాను కేంద్రం ప్రకటించలేదు.  రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.  


ఆ దోపిడీ నేతలపై చర్యలు తీసుకోండి, సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ


ఇండియా అనే పేరును  భారత్ గా మార్చడంతో పాటు పలు కీలక అంశాలపై బిల్లులు పెట్టబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చను కేంద్రం ఇలా సాగనిస్తోది కానీ... ఎన్నికలపై క్లారిటీ ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పదవీ కాలం జనవరితో ముగిసిపోతుంది. ఆ తర్వాత ఆపద్ధర్మంగా కూడా కొనసాగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికలు జరగలేదు కాబట్టి.. ప్రజా ప్రతినిదులే ఉండరు. రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. కనీసం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా... అధికారంలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ.. రాష్ట్రపతి పాలనలో అంతా గవర్నర్ చూసుకుంటారు. ఇక్కడే కీలక పరిణామాలకు కారణం అయ్యే అవకాశం ఉంది.