MP Komatireddy Venkat Reddy letter to CM KCR:

దళిత బంధు, బీసీ బంధు లో కమీషన్ల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పలు  విషయాలు సీఎం కేసీఆర్ కు వివరించారు.

తెలంగాణలో మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు, బీసీ బంధు పథకాలు పేద ప్రజలకు అందుతాయని ఆశించానని, కానీ మీ పార్టీకి చెందిన నాయకులు అనర్హులు అయినవారికి మంజూరు చేశారని లేఖలో వెల్లడించారు. గత వారం రోజులుగా తను ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల పరిధిలోని దళిత బంధు, బీసీ బంధు మంజూరైన వారి వివరాలు పరిశీలించగా.... మీ పార్టీకి సంబంధించిన అనర్హులైన వారికి మంజూరు చేశారని చెప్పారు. తిప్పర్తి మండలం కేంద్రంలో 566 మందు దళిత కుటుంబాలు ఉండగా... అక్కడ 12 దళిత బంధు యూనిట్లు మీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలకు మాజీ లకు ఇవ్వడం జరిగిందని కోమటిరెడ్డి లేఖలు తెలియజేశారు.

60 కోట్ల రూపాయల అవకతవకలు.... 
తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోరమైన స్కామ్ జరిగిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అక్కడ 30 శాతం కమీషన్ తీసుకుంటూ.. దళిత బంధు, బీసీ బంధు యూనిట్లను మంజూరు చేశారని చెప్పారు. తిరుమలగిరిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 180 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే... 60 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని వెలిగించారు. ఇక్కడ లోకల్ ప్రజా ప్రతినిధి ద్వారా వసూలు చేసిన కమీషన్... మంత్రి, ఎమ్మెల్యే ఎవరికి అందాయో సమగ్రమైన విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలు పేద ప్రజలకు అందకుండా పక్కదారి పడుతున్నాయని తెలిపారు. పేద దళితులకు అందాల్సిన 10 లక్షల రూపాయలు కమిషన్లకు ఆశపడి బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయిస్తున్నారు.

అవినీతికి పాల్పడితే సహించం... 
రాష్ట్రంలో అవినీతికి పాల్పడితే సొంత కొడుకు నైనా విస్మరించేది లేదని పదేపదే మీరు చెప్పినా కానీ... దళిత బంధు, బీసీ బంధు లో జరుగుతున్న అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కమీషన్ల వ్యవహారంపై నా దగ్గర ఉన్న వివరాలను అందిస్తానని తెలియజేశారు. అవసరమైతే లీగల్గా కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తా అని లేఖలో ప్రస్తావించారు. పేదలకు అందాల్సిన పథకాలు ఇలా కమీషన్ల రూపంలో బయటకు వెళ్లడం వల్ల మీకు ప్రజల్లో ఉన్న మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరి హస్తము ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల్లో మీ తీరును ఎండబెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో పేర్కొన్నారు.