KTR Fire On DGP, RTC MD :    టీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ప్ర‌చారం విష‌యంలో బీఆర్ఎస్ నాయ‌కులు, మ‌ద్ద‌తుదారుల‌పై కేసులు న‌మోదు చేయ‌డం ప‌ట్ల‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   డీజీపీ ర‌వి గుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌లకు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.  కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న‌వారిపై కేసులు ఎందుకు పెట్ట‌లేద‌ని ... ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్ర‌చారం చేసిన ఎన్టీవీ, బిగ్ టీవీ చానెల్స్, వెలుగు దిన‌ప‌త్రిక‌పై కేసులు ఎందుకు పెట్ట‌లేద‌ని కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.  రాజ‌కీయ పెద్ద‌ల మాట‌లు విని వేధిస్తే మిమ్మ‌ల్ని కూడా కోర్టుకు లాగుతామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు.


 





 


నిజాల‌ను బట్ట‌బ‌య‌లు చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులు పెడుతున్నారని కేటీార్ ఆరోపించారు.  కానీ అధికార పార్టీ నాయ‌కులే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే వారిపై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌డం లేద‌ని కేటీఆర్ ప్ర‌శ్నలు సంధించారు.  నా బంధువుకు రూ. 10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వ‌చ్చింద‌ని సీఎం ఆరోపించారు. స‌చివాల‌యం కింద నిజాం న‌గ‌లు త‌వ్వుకున్న‌ట్లు న‌కిలీ క‌థ అల్లారు. కేంద్ర హోం మంత్రి న‌కిలీ వీడియోను రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేశారు. ఓయూకు చెందిన న‌కిలీ స‌ర్క్యుల‌ర్‌ను సీఎం పోస్టు చేశారు. మ‌రి న‌కిలీ వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వ్య‌క్తిని జైల్లో ఎందుకు పెట్ట‌రు అని కేటీఆర్ ప్రశ్నించారు. 


 





 


టీజీఎ్‌సఆర్టీసీ నకిలీ లోగో వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్‌ మీడియా విభాగం మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీ్‌పపై కేసు నమోదైంది. ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై కొణతం దిలీ్‌పతోపాటు హరీశ్‌ రెడ్డి అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ ఐటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. టీజీఎస్‌ ఆర్టీసీ అధికారులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.


టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారన్న ప్రచారం తర్వాత లోగో వెలుగులోకి వచ్చింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లోగో అని.. చెబుతూ బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచి భాషలో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారం సీరియస్ గా మారింది.