KTR counters CM Ramesh comments: బీజేపీలో విలీనం కోసం కేటీఆర్ తన దగ్గరకు వచ్చారన్న సీఎం   రమేష్ ఆరోపణల పై   కేటీఆర్ స్పందించారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్వీ సమావేశంలో ఆయన  ప్రసంగించారు.  సీఎం రమేష్ - సీఎం రేవంత్ ఇద్దరూ  కలిసి వస్తే..  HCU రూ.10000 కోట్ల  స్కాం పైనా.. ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి  చర్చకు తాను సిద్ధమన్నారు.  ఎం రేవంత్.. .సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం నేను బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

HCU భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న..   పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారని అన్నారు.  నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కోసం పనికి రాని కథలు చెబుతున్నారని అన్నారు.  రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.  నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు.  ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు.  తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. 

సీఎం రమేష్ ఏమన్నారంటే ?

విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కేటీఆర్ అసహనంతో ఉన్నారని సీఎం రమేష్ ఆరోపించారు.  బీజేపీతో విలీనానికి సహకరించాలని తన ఇంటికి వచ్చి కేటీఆర్ కోరారన్నారు.   ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కవితతో సహా ఎవరిపైనా విచారణ వద్దని.. అన్నీ ఆపేస్తే.. తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని  .. సహకరించాలని కోరిన మాట నిజం అవునో కాదని చెప్పాలన్నారు. విలీనానికి  బీజేపీ ఒప్పుకోలేదని కూడా చెప్పానన్నారు. కమ్మవాళ్లను నమ్మేది లేదని కూడా కేటీఆర్ అన్నారన్నారు.                             

ఫ్యూచర్ సిటీలో తనకు ఏ కాంట్రాక్ట్ లేదన్నారు. నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి ప్రాజెక్టు వచ్చిందన్నారు.  సీఎంగా ఉన్నంత మాత్రాన కాంట్రాక్టులు ఎవరికి కావాలనుకుంటే వారికి ఇవ్వగలరా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లు అలాగే చేశారా అని నిలదీశారు. పదేళ్ల కాలంలో ఎవరెవరికి ఎన్నెన్ని కాంట్రాక్టులు ఇచ్చారో లెక్కలు తీద్దామని సవాల్ చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని.. బీార్ఎస్ హయాంలో కాంట్రాక్టులు ఎవరు చేశారో లెక్కలు తీయాలన్నారు.