KTR On Poice :  డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.    పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీని బీ  కేటీఆర్‌ ప్రశ్నించారు. వినరాని భాషలో సాధారణ పౌరుడలపై పోలీస్‌ సిబ్బంది విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డు గండి మైసమ్మ ఆలయం సమీపంలో ట్రాఫిక్‌ పోలీసులు ఓ వాహనదారుడిపై చేయిచేసుకుని బూతులు తిట్టిన   వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీన్ని ట్వీట్ చేసిన కేటీఆర్.. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. 


ఇది పోలీస్‌ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషేనా అని డీజీపీని ప్రశ్నించారు.   పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని  ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారని కేటీఆర్ తెలిపారు.  పదుల సంఖ్యలో సోషల్‌ మీడియాలో వీడియోలు వస్తున్నా పోలీసులు స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.  ప్రజలతో వ్యవహరించే విషయంలో పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. 


 





హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్‌ పోలీస్‌పై ఘటనపై పోలీసు శాఖ స్పందించారు.  పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకున్నారు.   సైబరాబాద్‌ జీడిమెట్ల ట్రాఫిక్‌ లిమిట్స్‌లో జరిగిందని ఈ ఘటన జరిగినట్లుగా తేల్చారు.  బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని అతన్ని ఆ స్టేషన్‌ నుంచి బదిలీ చేశామని తెలిపారు. తాము 24/7 గంటలూ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.                         


సామాన్యుల పట్ల పోలీసుల వ్యవహారశైలి వరుసగా వివాదాస్పదమవుతూనే ఉంది.  అనేక సార్లు దుర్భాషలాడుతూ ఉంటారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా ఎవరైనా బాధితులు వీడియో తీస్తేనే.. విషయం హైలెట్ అవుతుంది.  పోలీసుల తీరు వల్ల ప్రజలు భయపడుతున్నందునే.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పద్దతిని ప్రవేశపెట్టారు. కానీ అదేమీ పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. పోలీసుల నోటి దురుసు తనం వల్ల.. ముఖ్యంగా కొంత మది తీరు వల్ల ఆ శాఖకు చెడ్డ పేరు వస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.