KTR commented that the phones of both of them may have been tapped :  పది లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్  చేశారని యూట్యూబుల్లో వీడియోలు పెడుతున్నారని .. ఒకరిద్దరు  ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చని.. దానికే ఎందుకు ఇంత రాద్దాంతమని కేటీఆర్ ప్రశ్నించారు.  సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లుకుంటే యూట్యూబ్‌లో మొరిగే కుక్క‌ల దాకా.. ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయ‌కుడు కేసీఆర్‌ను ప‌ట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్ పాల్గొన్నారు. 
 
మ‌ల్కాజ్‌గిరిలో జ‌రిగే పోటీ.. కేవ‌లం వ్య‌క్తుల మ‌ధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మ‌ధ్య‌. కేసీఆర్ నిల‌బ‌డ్డారని భావించి ప‌ని చేయాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్ల‌లో తుఫానులా మెజార్టీ ఇచ్చారు. మూడు ల‌క్ష‌ల యాభై ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. కాబ‌ట్టి ఇప్పుడు ఇత‌ర పార్టీలు మూడున్న‌ర ల‌క్ష‌లు దాటి ముందుకు వ‌చ్చి గెల‌వాలి. అయినా కూడా ప్ర‌తి కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. కార్పొరేట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ప్ర‌తి ఇంటికి వెళ్లాలి. దేశంలోనే అత్యంత పెద్ద నియోజ‌క‌వ‌ర్గం మ‌ల్కాజ్‌గిరి. కాబ‌ట్టి ప్ర‌తి వాడ తిరిగి ప్ర‌చారం చేయాలి. రాగిడి ల‌క్ష్మారెడ్డి కుటుంబ స‌భ్యులు బ్ర‌హ్మాండంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని కేటీఆర్ తెలిపారు.


కాంగ్రెసోళ్ల మాట‌లు వింటుంటే ర‌క్తం మ‌రుగుత‌ది. హైద‌రాబాద్‌లో త‌న్నిన‌ట్లే మ‌రోసారి మ‌ల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల‌లో జాడిచ్చి త‌న్నాలని పిలుపునిచ్చారు.  దాంతో వారి నోరు మూత ప‌డ‌వాలి. అడ్డ‌మైన కారు కూతలు మూత‌ప‌డాలంటే కారు వంద కిలోమీట‌ర్ల వేగంతో ఉర‌కాలని పిలుపునిచ్చారు.  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మ‌నిషా..? రాహుల్ మ‌నిషా..? మోదీ మ‌నిషా..? అర్థం కావ‌డం లేదు. న‌రేంద్ర మోదీ దొంగ అని రాహుల్ అంటే, రేవంతేమో మోదీ బ‌డే బాయ్ అంట‌డు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాండ్ అంటుంటే.. అదానీ హ‌మారే ఫ్రెండ్ అంటుండు రేవంత్. గుజ‌రాత్ మోడ‌ల్ ఫేక్ అని రాహుల్ అంటుంటే.. రేవంత్ రెడ్డేమో తెలంగాణ‌ను గుజ‌రాత్ మోడ‌ల్ చేస్తా అంటుండు. మైనార్టీల కొపంలు పుచ్చుకుని, బుల్డోజ‌ర్ల‌తో ఇండ్లు కూల‌గొట్టి, దిక్కుమాలిన ప‌నులు చేసి హిందూ – ముస్లిం ఫీలింగ్ తెస్తావా..? లిక్కం స్కాం లేదు.. మ‌న్ను లేదు.. అర‌వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయ‌డం త‌ప్పు అని రాహుల్ అంట‌డు.. రేవంత్ రెడ్డేమో క‌విత‌ను అరెస్టు చేయ‌డం క‌రెక్ట్ అని అంట‌డు. అస‌లు రేవంత్ ఎవ‌రి మ‌న‌షి..?ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.


ఒక్క ఓటు రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా అది అల్టిమేట్‌గానే బీజేపీకి లాభం అయిత‌ది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ బీజేపీలోకి జంప్ అవుతాడు. ఈ మాట అన్న‌ప్పుడు రేవంత్ ఖండించ‌డం లేదు. ఆయ‌న మొద‌ట ఏబీవీపీలో ఉన్నారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్, అక్క‌డ్నుంచి టీడీపీ, కాంగ్రెస్‌లో చేరారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ మాతృసంస్థ బీజేపీలోకే పోత‌డు. ప‌చ్చి అవ‌కాశ‌వాది రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌కు మ‌రో ఎజెండా లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.