Revanth Reddy Rythu Bandhu : రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటంపై వస్తున్న విమర్శలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారన్నారు. ఈ సారి డిసెంబర్ 9వ తేదీనే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ లకు చురకలు అంటించారు.
అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనం - నారా లోకేష్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాళీ కుండలే ఉన్నాయి.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లిందంటూ స్పష్టం చేశారు. మేం లంకె బిందెలు అని వస్తే.. ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని.. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. గతంలో నాలుగు నెలలపాటు వేస్తూ వచ్చారని.. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన మొదలుపెట్టారని.. ఇప్పుడు డిసెంబర్ 20వ తేదీ నుంచి నిధుల జమ చేస్తూ వస్తున్నట్లు వివరించారు.
జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ - పవన్ సమక్షంలో చేరిక !
రైతుబంధు పథకంపై పరిమితులు విధించబోతున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం రైతు బంధుపై ప్రకటన చేస్తామన్నారు.
రైతు బంధును ఇచ్చేసినమన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకరత్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తమకు ఇంకా రైతు బంధు రాలేదని చెబుతున్నారు ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు వారాలు కూడా కాక ముందు పథకాల అమలుపై.. కాంగ్రెస్ సర్కార్ ను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో అందరికీ రేవంత్ కౌంటర్ ఇచ్చారు.