Telangana Medical Colleges : తెలంగాణలో మెడికల్ విద్య ఉన్నత స్థానాలకు చేరుకుంటోంది. తాజాగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవానికి రెడీ అయ్యాయి. ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో తరగతులను కేసీఆర్ ప్రారంభించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు ఇక ఢిల్లీలోనే - తుది జాబితా ప్రకటన ఎప్పుడంటే ?
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని మంత్రి హరీష్ రావు చెబుతున్నారు.
కాంగ్రెస్, సీపీఐ పొత్తులపై కసరత్తు - కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ చర్చలు !
తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.
వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ గత జూలైలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల వివరాలు, సీట్ల సంఖ్య తెలపాలని పలువురు ఎంపీలు కోరారు. ఆ వివరాలను కేంద్ర వైద్య శాఖ శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 28, ప్రైవేటులో 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దక్షిణాదిలో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే మెరుగైన వైద్య విద్య అందుతోంది.