Kaleshwaram Commission Kavitha:  కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనని ఆరోపిస్తున్నారు కల్వకుంట్ల కవిత. అందుకే కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యే ముందు రోజు ఇందిరాపార్క్ లో భారీ ధర్నా చేయాలనుకుంటున్నారు. నాలుగో తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కేసీఆర్.. ఐదో తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం లేదు. తనకు ఆ రోజు కుదరదని పదకొండో తేదీన వస్తానని ఆయన సమాచారం పంపించారు. దానికి కాళేశ్వరం కమిషన్ అంగీకారం తెలిపింది. అయితే ఐదో తేదీని ఎందుకు మార్చుకున్నారు.. ..పదకొండో తేదీన ఏం స్పెషాలిటీ ఉంది అని రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమయింది.  


నాలుగో తేదీన నిరసనలకు పిలుపునిచ్చిన కవిత              


అయితే కేసీఆర్ కవితకు షాక్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పార్టీని ధిక్కరిస్తూ కవిత సొంత కుంపటి పెట్టుకునే దిశగా వెళతున్నారు. కేసీఆర్ ఫోటోతో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తే బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ కు కూడా జాగృతి కూడ ా ఓకన్ను అని ఆమె చెబుతున్నారు. అయితే కేసీఆర్  బీఆర్ఎస్ అధ్యక్షుడని.. ఆయన మరో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే సంస్థకు ఎలా మద్దతిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో కవిత చేపట్టే నిరసనలకు ప్రాధాన్యత లేకుండా చేయాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.   


కవిత విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోని కేసీఆర్          


ప్రస్తుతానికి కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షోకాజ్ నోటీసులు ఇస్తారని.. సస్పెండ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.కానీ అలాంటి నిర్ణయాలేమీ అమల్లోకి రాలేదు. అదే సమయంలో కేటీఆర్ ప్రస్తుతందేశలో లేరు.   బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల కోసం అమెరికాలో ఉన్నారు. కేటీఆర్ లేకుండా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లడం మంచిది కాదని  బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లుగా చెబుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అయితే అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లుగా చెప్పుకోవచ్చు.కానీ హాజరు కాకుండా మినహాయింపుల కోసం చూస్తే.. తప్పు చేయకపోతే భయమెందుకు అనే ప్రశ్నలు వస్తాయి. ఈ కారణంగానే కేసీార్ .. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.              


కేటీఆర్ వచ్చిన తర్వాతనే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే చాన్స్           


బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ఎన్నికలకు ముందు కుంగిపోయింది. దాంతో విచారణ నిర్వహించారు. ఎన్డీఎస్ఏ నివేదిక  లో అనేక అంశాలు వెలుగు చూశాయి. అక్రమాల సంగతి బయట పెట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ను ప్రశ్నించిన తర్వాత ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈటల రాజేందర్ మాత్రం ఐదో తేదీనే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది.