Union Govt sanctions funds Rs 100 for NH 63 says Vivek Venkataswamy: పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని చెన్నూర్ (Chennur) ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లతో ఎన్ హెచ్-63 రోడ్డు విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులను కేంద్రం నిధులు మంజూరు చేసిందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం నాడు భేటీ అయ్యారు.


ఢిల్లీలోని గడ్కరీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రిని పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సన్మాన్మించారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారుల విషయమై కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ఎన్‌హెచ్ -63 రోడ్డు విస్తరణ, కొత్త రోడ్లను మంజూరు చేసినందుకు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మరో 15 రోజుల్లో రూ.1 కోటి 80 లక్షలతో మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోనీ పలు రహదారి హైవే సమస్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి చర్చించామన్నారు. అభివృద్ధి కోసం, తాము ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.