Karimnagar News: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే పాలకులను ఎన్నుకోవడంలో యువత ఆలోచనలు చాలా కీలకం. ఇందులోనూ కొత్తగా ఓటు వేసే అవకాశం వచ్చిన యవతీ యువకుల ఆలోచనలు ఆసక్తిగా ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన యువత ఆసక్తిని చూపుతున్నారు. కరీంనగర్ లోని నూతన ఓటర్స్ మాత్రం తమకు కావలసిన నాయకుల్ని ఎన్నుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఐతే ఇదే విషయం పై abp దేశం నూతన ఓటర్లతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ నిర్వహించింది.


రాజకీయాలలోకి ముఖ్యంగా విద్యావంతులు మేధావులు రావాలి.. అలాంటి వారు వస్తేనే దేశం బాగుపడుతుంది..ఉచిత పథకలు పెట్టి ఓటర్స్ ను సోమరి పోతులుగా చేస్తున్నారని నూతన ఓటర్స్ అన్నారు. ముఖ్యంగా యువత మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాలను ఒక మంచి మేధావి చేతిలో పెడితే భవిష్యత్ తరాలకు చాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. 


అదే మాదిరిగా ఈసారి పార్లమెంటు ఎలక్షన్స్ లో దాదాపు 80 లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కలిగింది. ఈ 80 లక్షల ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో ఒక మంచి పాలన అందించే నాయకులకే వేయాలని ఇప్పటి యువత ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. ముఖ్యంగా యువత చెబుతున్నాదాని ప్రకారం.. ‘‘రోడ్లు, లైట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా..  ఉద్యోగ అవకాశాలు, మెరుగైన విద్య, వైద్యం ఇవ్వాలని కోరుతున్నారు. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ అభివృద్ధి చెందిన దేశం కాదు.. చాలా మంది ప్రజలకు కనీసం కూడు గుడ్డ లేకుండా ఉన్నారని అన్నారు. కాబట్టి ఈసారి యువత మంచి నాయకులను ఎన్నుకోవాలనే ఆశయంతో ఉన్నారు.