Telangana Decade Celebrations: సిరిసిల్లలో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు ఇచ్చారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు.
తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నామన్నారు కేటీఆర్. తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతోందన్నారు. చాలా విపత్తులను అన్నింటిని తట్టుకొని బలియమైన శక్తిగా ఎదుగుతోంది. సంక్షోభ సమయంలో ఆర్థిక నిర్వహణ చేస్తూ భారీ సంక్షేమ, ఆర్థిక కార్యక్రమాలు చేపట్టడం తెలంగాణకే సాధ్యమైంది. అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాం. రాజన్న సిరిసిల్ల తనకంటు ప్రత్యేకత చాటుకుంటూ అభివృద్ధి సాధిస్తోందన్నారు కేటీఆర్.
తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు తమ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని వేరే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు కేటీఆర్. ఉమ్మడి పాలకులు కేటాయించిన నిధుల కంటే ఇరవై రెట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టు, రైతు వేదికలుఇలా లెక్కకు మించిన సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారన్నారు. దుక్కి దున్నినప్పటి నుంచి విత్తనం కొనుగోలు వరకు అండగా ఉంటున్నారని వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,40,430 ఎకరాలకు పెరిగింది. రైతుల బంధు పథకం కింద 1,139 కోట్ల రూపాయలు ముందస్తు పంట పెట్టుబడి కోసం ఖాతాల్లో వేశాం. మొదటిసారి ఆయిల్ పామ్ సాగుకు వెయ్యి కోట్లు కేటాయించాం. జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతులు. 4200 మెట్రిక్ టన్నుల 14 గోదాం ఉండేవి. ఇప్పుడు 14 ఆధునిక గోదాం జిల్లా నిర్మించాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పాతిక ఎకరాల్లో మార్కెట్ యార్డ్ నిర్మించాం. రైతు బీమా పథకం ద్వారా 1803 రైతులకు బీమా పరిహారం ఇచ్చాం. 150 కోట్లతో మూడు పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తైతే 800 మంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. నూనె గింజల పరిశ్రమ, అపరెల్ పార్క్, వేములవాడను ఆధ్యాత్మిక టూరిస్ట్ సర్క్యూట్‌గా చేస్తున్నాం.