BRS MLA Pocharam Srinivas Reddy:  తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇన్నాళ్లు చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చేరికల స్పీడ్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్నారు.  నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


పోచారంతో ఇంటి వద్ద ఉద్రిక్తత


పోచారంతో రేవంత్ రెడ్డి సమావేశమైన విషాయన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హైదరాబాద్‌లోని పోచారం ఇంటి వద్దకు చేరుకొని  ధర్నా చేస్తున్నారు. భారీగా శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కొందరు నేతనలు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.