TSPSC Accounts Officers Results: తెలంగాణ పురపాలకశాఖలో అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను టీజీపీఎస్సీ జూన్ 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను ప్రకటించింది. మొత్తం 78 ఉద్యోగాలకుగాను 76 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపికచేసింది. 


టీజీపీఎస్సీ ఫిబ్రవరి 21న అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనరల్ ర్యాంకింగ్ జాబితాలో మొత్తం 12,186 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆ తర్వాత పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1 : 2 నిష్పత్తిలో 78 పోస్టులకు 164 మంది అభ్యర్థులకు ఏప్రిల్ 8న నాంపల్లిలోకి టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. వీరి నుంచి 76 మంది తుది ఎంపికచేశారు.


ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్  డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం గతేడాది ఆగస్టు 8న ఈ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించారు. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (కామర్స్ - డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.


రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 21న విడుదల చేసింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్సర్ కీపై అభ్యతరాలు స్వీకరించింది. తదనంతరం ఫిబ్రవరి 12న తుది ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 21న ఫలితాలను విడుదల చేసింది. 


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 78


1) అకౌంట్స్ ఆఫీసర్: 01


2) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 13


3) సీనియర్ అకౌంటెంట్: 64 


జీతం: 


⏩ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.45,960 - రూ.1,24,150.


⏩ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.42,300 - రూ.1,15,270.


⏩ సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.32,810 - రూ.96,890.


ALSO READ:


సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగ రాతపరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది. పరీక్షలను జూన్‌ 24 నుంచి 29 వరకు  నిర్వహించనుంది. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి మూడురోజుల ముందునుంచి అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) 581 ఖాళీల భర్తీకి 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...