World Bathing Day 2024  : ఈ రోజుల్లో చాలామంది బిజీలైఫ్ గడుపుతున్నారు. భోజనం చేసేందుకు కూడా సమయం లేనంత బిజీగా మారుతున్నారు. ఈ బిజీలైఫ్ కారణంగా స్నానం చేసే ఒక పనిని మర్చిపోతున్నారు. మరికొందరు స్నానం చేయడానికి బద్దకిస్తున్నారు. ఇక చలికాలం వచ్చిందంటే.. స్నానమా? అంటే ఏమిటని అమాయకంగా అడుగుతున్నారు.


మన శరీరం శుభ్రంగా ఉండాలంటే స్నానం చాలా అవసరం. లేకపోతే ఆరోగ్యానికి హనిచేసే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. స్నానం.. మనలో శక్తిని నింపుతుంది. శరీరంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. అందుకే రోజూ స్నానం చేయాలని చెబుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇదే విషయాన్ని జనాలతో పంచుకుంది. రష్మిక ఐటిసి ఫియామా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ‘వరల్డ్ బాతింగ్ డే’ సందర్భంగా రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 


స్నానం మన జీవితంలో చాలా ముఖ్యమైనదని.. ఇందుకు సమయం కేటాయించాలని రష్మిక పేర్కొంది. స్నానం ఒక అందమైన అనుభూతి అని తెలిపింది. ‘‘స్నానం.. నన్ను నేను రిఫ్రెష్ చేసుకునే చక్కటి చర్య. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా.. సినిమా సెట్స్ లో అలసట నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. నేను స్నానం చేసే ప్రక్రియలో బాడీ ఆయిల్స్, మాయిశ్చరైజర్లతో పాటు, సాండల్ వుడ్ ఆయిల్, అలాగే పచ్చౌలి షవర్ జెల్‌ను ప్రత్యేకంగా ఉపయోగిస్తా’’ అని తెలిపింది. షవర్ జెల్‌లోని కండిషనర్లు తన చర్మానికి మరింత మృదుత్వాన్ని అందిస్తాయని రష్మిక పేర్కొంది. శాండిల్ వుడ్ పరిమళం తనకు చిన్ననాటి అనుభూతుల్ని గుర్తు చేస్తుందని తెలిపింది.


బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ప్రాధాన్యం:


రష్మిక తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు.. తాను కొనుగోలు చేసే ప్రొడక్టులతో చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. చాలా మంది చర్మాన్ని మెరిసేలా  చాలా ప్రొడక్టులు కొనుగులు చేస్తుంటారని.. తాను మాత్రం బ్యూటీ ప్రొడక్ట్స్ పట్ల జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చారు. రష్మిక తన చర్మకాంతి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో కూడా తెలిపింది.


తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సమతుల్య ఆహారం, ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అంతేకాదు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రెటేడ్ గా ఉంచుకునేందుకు తగినంత నీరు, పండ్లు, కాయకూరగాలను తన డైట్లో చేర్చుకుంటానని తెలిపింది. అయితే తాను తీసుకునే ఆహారంలో అలర్జీకి కారణమయ్యే పదార్థాలకు దూరంగా ఉంటానని పేర్కొంది. ఇక ఆయిల్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లనని చెప్పంది. ఇక వారంలో కనీసం మూడు రోజులు యోగా, స్విమ్మింగ్, వాకింగ్ వీటిలో ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడతానని చెప్పింది నేషనల్ క్రష్. 


ఇది కూడా చదవండి: ఆయుష్సు కావాలా? చిన్న చేపలను ముళ్లతో సహా నమిలి తినేయాలట, ఇంకా ఈ 8 సూత్రాలు కూడా ఫాలో అవ్వండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.