TS Farmer: ప్రభుత్వం వరి సాగును వద్దన్నా అన్నం పెట్టే రైతు కాస్త వెనక్కి తగ్గి ఆలోచించినా పొట్ట కోసం పంటను పండించక తప్పడం లేదు. సాగు చేసిన ఆ వరి పంటను ఎట్లా కాపాడుకోవాలో తెలియక రైతులు ఎన్నో ఇబ్బందులు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఓవైపు అకాల వర్షాలు మరోవైపు చీడపురుగులుతో పంట నష్టం జరుగుతున్న పరిస్థితులు ఉండగా ఈ రెండింటినీ మించి కోతుల మందతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న సిద్దిపేట జిల్లాలో రైతు ఎలుగుబంటి వేషం వేయగా.. తాజాగా సిరిసిల్ల జిల్లాలో అన్నదాత మరో మార్గాన్ని ఎంచుకున్నాడు.


రైతులకు కోతుల బెడద.. 
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla Farmer) ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో పాతూరి లక్ష్మారెడ్డి  జైపాల్ రెడ్డి అని రైతులు నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ప్రతిరోజు కోతులు ఆ పంటను ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎన్నోసార్లు కోతుల కావలికి వెళ్లి పొద్దంతా ఉంటూ వాటిని తరుముతున్న కిష్కింద కాండ నుతలపించే విధంగా పంటల మీద పడుతుండడంతో దానిని కాపాడుకోవడం కోసం ఏకంగా పులి బొమ్మలు తీసుకు వచ్చి కోతుల నివారణ కోసం పంట రక్షణ చర్యలు చేపట్టాడు.


హైదరాబాద్ నుంచి మూడు వేల రూపాయల విలువ చేసే ఓ పెద్ద పులి బొమ్మ తీసుకొని వచ్చి కోతుల మంద పొలం వద్దకు రాగానే దాన్ని బూచిగా చూపిస్తూ వరి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా రైతులు ఇద్దరు ప్రతినిత్యం కోతులను తెరిచేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ప్రధానంగా గొల్లపల్లి బొప్పాపూర్ పదిర రాజన్నపేట గ్రామాల్లో కోతుల హంగామా ఎక్కువయింది. ఇళ్లలోకి చొరబడడంతో పాటు పొట్ట దశకు వచ్చిన వరి పంటను ధ్వంసం చేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. 11600 ఎకరాల్లో ఈ సీజన్లో వరి సాగు చేశారని ఏవో భూమిరెడ్డి  వెల్లడించారు. కోతుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి వాటిని అడవులకు పంపేలా సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


సిద్దిపేట రైతు ఎలుగుబంటి వేషం..
హైదరాబాదులో ఎలుగుబంటి ఆకారంలో దుస్తులు తయారు చేస్తారని తెలుసుకున్న రైతు భాస్కర్ రెడ్డి  హైదరాబాద్ వెళ్లి రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించి తీసుకువచ్చారు.  ఇప్పుడు ఆ దుస్తులను పంటకు రక్షణగా ఉపయోగిస్తున్నారు. పంటకు రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణతో కూలీని పెట్టుకొని రోజుకు అతనికి 500 రూపాయలు చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నారు. రైతు భాస్కర్ రెడ్డి పంటతో పాటు పక్కనే ఉన్న దాదాపు 25 ఎకరాల పంటకు కూడా నష్టం వాటిల్లకుండా ఈ ఎలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే తిరిగి పది రోజుల వరకు పంటల వైపు రావని రైతులు అంటున్నారు. 


Also Read: Karimnagar: ఒంట్లో బాలేదని లీవ్ పెట్టిన గవర్నమెంట్ టీచర్ - ఘనకార్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్, అంతా అవాక్కు!


Also Read: Yadadri: యాదాద్రి నిజరూప దర్శనం నేడే, తొలి భక్తుడిగా కేసీఆర్ - ఆలయంలో నేటి కార్యక్రమాలు ఇవీ