హుజూరాబాద్ నియోజకవర్గంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ పర్యటించారు. అక్కడ దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడారు. దళిత బంధు ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సొమ్ముతో వ్యాపారాలు పెట్టుకొన్న వ్యక్తులతో మాట్లాడారు. దళిత బంధు యూనిట్లను పరిశీలించారు. హుజురాబాద్, జమ్మికుంటలో దళిత బంధు యూనిట్లను ప్రకాష్ అంబేడ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత బంధుపై ప్రకాష్ అంబేడ్కర్ మాట్లాడారు.
 
దళిత బంధు పథకాలు పకడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కౌంటర్ గ్యారంటీ అడగడమే ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అన్నారు. 70 ఏళ్లుగా జీవన ప్రమాణాలు మెరుగు పడక పోవడం వల్ల దళితులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. దళిత బంధు పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ వేడుకలకు శుక్రవారం ఉదయం (ఏప్రిల్ 14) ముఖ్య అతిథిగా హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతించారు. శాలువా కప్పి సన్మానించి దళిత బంధు జ్ణాపికను అందజేశారు. హుజురాబాద్లో దళితబంధు లబ్ధి దారులను కలిసి వారి అనుభవాలను, దళిత బంధు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన సమూల మార్పుల గురించి ప్రకాష్ అంబేడ్కర్ తెలుసుకొనేందుకు అక్కడికి పయనం అయ్యారు. మంత్రి గంగులతో పాటు, విప్ బాల్క సుమన్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


యశ్వంత్ అంబేడ్కర్ తో కలిసి బేగంపేట విమానాశ్రయం నుండి హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొని వెళ్లారు.