Karimnagar Rains: కరీంనగర్ జిల్లాలో వర్షానికి కూలిన వంతెన, కిలోమీటర్ల మేర నడుస్తూనే ఉన్న ప్రజలు

Telangana News | కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో వర్షానికి వంతెన కూలిపోయింది. దాంతో రోడ్డు ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిలోమీటర్ల మేర ప్రజలు నడుస్తూనే వెళ్తున్నారు.

Continues below advertisement

Karimnagar District | తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వర్షం దాటికి నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో రోడ్డు మార్గంలో ఉండే వంతెనలు కూలిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ వంతెన కూడా కోలడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే విషయంపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ...

Continues below advertisement

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే వాగు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామడుగు మండలం చుట్టుపక్కల ఉండే గ్రామాలు అన్ని కరీంనగర్ చేరుకోవాలంటే ప్రధానమైన రహదారి రామడుగు వంతెన . ఈ వంతెన వరద ప్రవాహానికి తెగిపోవడంతో చుట్టుపక్కల ప్రజలంతా చొప్పదండి మండలం పెగడపల్లి మండలం పైనుంచి గంగాధర మీదుగా సుమారు 20 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి నా పరిస్థితి ఏర్పడింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం...

గతంలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన రామడుగు వంతెన నిర్దాక్షనంగా నిలిపివేశారని స్థానికంగా చెబుతున్నారు. వంతెన నిర్మించే పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు భూములు కోల్పోవడంతో వారికి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ఈ వంతెన ఆగిపోయింది. అయితే బిఆర్ఎస్ హయాంలో ఆ ప్రభుత్వం తమకు అన్యాయం చేసేందుకు చూశారని అందుకోసమే ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆపేశామని ఇక్కడ ఉండే రైతులు చెబుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రామడుగు మండల ప్రజలు కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని ఇక్కడ ఉండే గ్రామస్తులు వాపోయారు. సాక్షాత్తు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రామడుగు గ్రామం మీదుగా సందర్శించేవారని ఎన్నడూ కూడా తమ కష్టాలు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో రామడుగు మండలంలోని మోతే వాగు ప్రవాహం ఎక్కువ అవ్వడం ఈ వాగు తెగిపోవడంతో ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు నిత్యవసర పరిస్థితుల్లో కిలోమీటర్ల మేర తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నామని అంటున్నారు గ్రామస్తులు.

అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆగిపోయిన ఈ పనులు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వర్షం దాటికి మళ్ళీ ప్రారంభం అయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రైతులకు భరోసాను ఇవ్వడంతో తిరిగి వంతెన పనులు ప్రారంభించారని తాము ఎంతో రుణపడి ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు.

Continues below advertisement