Paddapalli Rains: ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నగరాలు నీటి పాలయ్యాయి. అయితే దాదాపుగా 39 ఏళ్ల కిందట ఉమ్మడి జిల్లాలోని మంథని (పెద్దపల్లి జిల్లా) పట్టణానికి వచ్చిన వరద కూడా అప్పట్లో పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ ఈ సారి ప్రకృతి పగబట్టిందా అనే తీరుగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మంథని నగరమంతా ప్రభావితం అయింది. ఎక్కువ వరదలు వచ్చినా రాని పరిస్థితి  ఈసారి ఎందుకు వచ్చిందో ఓ సారి చూద్దాం. నిజానికి మంథని చుట్టూ ఆరు ప్రధాన చెరువులు ఉన్నాయి ఈసారి అన్నింటిలోనూ మొత్తం పురపాలక సంఘం పరిధిలో 13 వార్డులలో దాదాపు 22 వేల జనాభా నివాసముంటున్నారు. ఇక పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు దాదాపు 10 వరకు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న 30 వరకు ఇల్లు దెబ్బతిన్నాయి. దొంతులవాడ, మరివాడ, లైను గడ్డ, రజక వాడ, నాయి బ్రాహ్మణవాడ, బోయి పేట, వాగుగడ్డ  ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


కారణాలు ఇవేనా..
ఒకేసారి  కాళేశ్వరం ప్రాజెక్టు లోని సుందిళ్ల బ్యారేజీ నుండి 72 గేట్లు తెరవడంతో 13 లక్షల క్యూసెక్కుల మీరు దిగువ ప్రాంతానికి ప్రవహించింది. దీంతో రెండు రోజుల్లోనే మూడు లక్షల క్యూసెక్కుల నీరు స్థానిక బొక్కల వాగు నుంచి వెనక్కి వెళ్లి మంథని ప్రధాన మురుగు కాలువ ద్వారా పట్టణంలోకి వచ్చింది. ఖానాపూర్ గ్రామ సమీపంలో గోదావరి లో కలిసే అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇక 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో కట్టిన ఇరువైపులా ఐదేళ్ల కిందట దాదాపు 68 కోట్లతో కట్టిన కరకట్టలు కూడా వరద నీటిని పట్టణంలోకి రాకుండా నివారించలేక పోయాయి. దీంతో భారీ వర్షాలతో ఆకస్మికంగా వచ్చిన వరద నీరు పట్టణంలోకి చుకుని వచ్చి పలు ప్రాంతాలను నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామయ్య అంటున్నారు.


నిజానికి ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఇలా చేయి దాటిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఒకే సారి వచ్చిన వరద నీరు పట్టణంలోకి దారి అసలు కారణంగా గుర్తించారు. కేవలం కిలోమీటర్ చెక్ డాం బొగ్గుల వాగు నిర్మించారు. ఎంత వరద ఉధృతి ఉన్నా మూడు మీటర్ల మేర గోడ కూడా నిర్మించారు. మరోవైపు మూడు మీటర్ల లోతులో కింది నుండి నాలా కూడా పూర్తయింది.  కానీ వరద నీటిని మాత్రం అడ్డుకోలేక  పోయాయి .దీనిపై మరోసారి అధికారులు  ఆలోచించి భవిష్యత్తులో పకడ్బందీగా వ్యవహరిస్తే గాని మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా నివారించవచ్చు.