రోటీన్‌కు భిన్నంగా ఉండే థియేటర్‌లో వింతనై అనుభూతితో జగిత్యాలలో సినిమా చూసేయొచ్చు. మారుతున్న టెక్నాలజీతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. అందుకే వారిని ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు నిర్వాహకులు. మల్టీప్లెక్స్‌లను ట్రెండీ అయినప్పటికీ చిన్న చిన్న పట్టణాల్లో ఇదేమి లాభసాటి వ్యాపారం కాదు. అందుకే అంతకు మించిన అట్రాక్టివ్‌ ఫెసిలిటీస్‌ తక్కువ ఖర్చుతో సినిమా చూపిస్తున్నారు థియేటర్ యజమానులు. అలాంటి సరికొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటోంది జగిత్యాలలోని ఓ థియేటర్


డిజైన్ నుంచి సౌండ్ సిస్టం వరకు క్రియేటివిటితో సినిమా చూడటంలో కొత్త ఎక్స్‌పీరియన్స్ అందివ్వాలనుకున్న ఓ యజమాని.. జగిత్యాలలో డిఫరెంట్‌గా థియేటర్‌ నిర్మించారు. మల్టీప్లెక్స్‌లు, సినీ మ్యాక్స్‌లను తలదన్నేలా థియేటర్‌ని డిజైన్ చేశారు.
ఇగ్లూ మోడల్ థియేటర్ ఇప్పుడు జగిత్యాలలో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ అన్న మాట. 


హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబైలోని థియేటర్లలో కలిగితే అనుభూతి జగిత్యాల ప్రేపక్షకులకు అందించేందుకు మినీ థియేటర్‌ కట్టించారు. సినిమా హాలు ఇగ్లూ షేప్‌లో నిర్మించారు. అందుకే దీనికి ఇగ్లు థియేటర్‌ అని పేరు పెట్టారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించి కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇలాంటి ఢిపరెంట్‌ సినిమా హాలు నిర్మించడం ఉత్తర తెలంగాణ(Telangana)లో ఇదే మొదటిసారి.


జగిత్యాలలోని వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామస్తులు సినిమా చూడాలంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాలకు వెళ్లాలి. అలాంటి సినిమా అభిమానుల కోసం రాజశేఖర్ అనే వ్యక్తి ఇగ్లూ థియేటర్‌ని నిర్మిస్తున్నారు. మంచు ప్రాంతాలలో అకర్షనీయంగా కనిపించే ఇగ్లు ఇళ్ల నిర్మాణాన్ని అచ్చుగుద్దినట్లు ఈ థియేటర్ ఉండటంతో నిర్మాణ దశలోనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయింది.


ముంబైకి చెందిన చోటు మహరాజ్‌ మినీ థియేటర్‌ సంస్థ ఈ మినీ థియేటర్‌ని నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమా హాలు నిర్మాణం దాదాపుగా తొంభై శాతం పూర్తి అయ్యింది. ఇప్పటికే చోటు మహారాజ్ సంస్థ ద్వారా ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఇగ్లు థియేటర్ ఇక్కడ రూపు దిద్దుకుంటుంది.


నెల రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రానుంది ఇగ్లూ థియేటర్. రోజు ఐదు షోలు సినిమాలు నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు యజమాని రాజశేఖర్..


ఈ మిని థియేటర్‌లో వంద సీట్ల కెపాసిటి, పుల్ ఏసి, హైక్వాలిటీ సౌండ్‌ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇరవై గుంటల స్థలంలో కోటి రూపాయలు ఖర్చు చేసి ఈ ఇగ్లు థియేటర్‌ నిర్మిస్తున్నారు. తెలంగాణలో నగరాలే కాదు పట్టణాలు, గ్రామాలు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. అభివృద్ధి పరిణామక్రమంలో భాగంగా తెలంగాణలో ఇలాంటి మినీ థియేటర్ల సంఖ్య పెరుగుతాయంటున్నారు.