Karimnagar Teacher News: తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో వరుసగా ఏదో ఒక రకమైన సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఘటన మరువకముందే పెద్దపెల్లి జిల్లాలో మరొక పాముకాటు ఘటన చోటుచేసుకుంది పెద్దపెల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాముకాటు వేయడంతో పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్న నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని గురుకుల సాంఘిక సంక్షేమ కళాశాలలో మరొక సమస్య వెలుగులోకి వచ్చింది.


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. నెలసరి ఉన్న సమయంలో, విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో జోత్స్న అనే టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలగొట్టి లోనికి వచ్చి తన ఫోన్ తో వీడియో రికార్డు చేస్తూ తమని కొడుతుందని ఆందోళనకు దిగారు. పీటి టీచర్ ను  సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.


500 పైగా విద్యార్థినులకు రెండు బాత్రూంలో ఉండటం చాలా ఇబ్బంది కరంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. పీటి జ్యోత్స్నా విద్యార్తినులను పెట్టే ఇబ్బందులు భరించలేక సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగినట్లు బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు తెలిపారు.


తాము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోపలికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ బూతులు తిడుతూ, కొడుతూ తీసుకెళ్తుందని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పిటీ జోత్స్న ఆమె పెట్టే ఇబ్బందులు భరించలేక కొట్టిన బెబ్బలని చూపిస్తూ రోదిస్తున్నారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాలంటూ  రోదిస్తున్నారు.


విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మండల ఎంఈఓ రఘుపతి, పోలీసులు జ్యోత్స టీచర్ ను విధుల నుండి తప్పిస్తున్నామని ప్రకటించారు. డీఈఓ హామీతో ఇవ్వడంతోనే ఆమెను టీచర్ బాధ్యతల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. ఆ తర్వాతే ఆందోళన విరమించుకున్నారు విద్యార్థినులు.