Karimnagar News: కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగానే స్థానిక జడ్పీ సీఈవో ప్రియాంక తన గానంత అతిధులను, భక్తులను అలరించారు. అన్నామాచార్య కీర్తనలు పాడుతూ... అందరినీ భక్తిపారవశ్యంలో ఓలలాడించారు. సాధారణంగా ఒక జిల్లాకు చెందిన ముఖ్య అధికారిని రోజువారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. సెలవు దినాల్లో మాత్రం కచ్చితంగా కుటుంబానికి సమయం కేటాయించి.. వారితోనే ఎక్కువగా గడిపేందుకు చూస్తుంటారు. అయితే అటు ఉద్యోగంతోపాటు ఇటు తను ఎంచుకున్న శాస్త్రీయ సంగీతాన్ని సైతం ప్రాక్టీస్ చేస్తూ జిల్లాకు చెందిన ఈ ఆఫీసర్ తన టాలెంట్ ని పదుగురు లోను ప్రదర్శిస్తున్నారు. ఆవిడ ఎవరో కాదు.. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ( ఐఏఎస్) జీవిత భాగస్వామి. జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘనంగా జరుగుతున్న ఆరో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈవో అన్నమాచార్య కీర్తనలతో భక్తులను అలరించారు. తాను నేర్చుకున్న ముద్దుగారే యశోద, అనిమిషేంద్రులు తదితర కీర్తనలతో స్వామివారిని తన గానంతో సేవించారు. ఎప్పుడు కీలకమైన పనుల్లో బిజీగా ఉండే ఉన్నతాధికారులు భక్తి పార్వ పారవశ్యంతో కూడిన ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సేవ చేయడం నిజంగా అరుదేమరి. అయితే తనకి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉండడంతో రెండో తరగతి నుంచే సంగీతం నేర్చుకున్నానని చెబుతున్నారు. ఆ తరువాత చదువు బిజీలో పడి కొనసాగించలేకపోయానని... కానీ తిరిగి ఖమ్మంలో నేర్చుకునే అవకాశం లభించగా తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించారని జడ్పి సీఈఓ ప్రియాంక అంటున్నారు.
గతంలో ఒకసారి భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం సమయంలో కచేరి ఇచ్చే అవకాశం లభించిందని మళ్లీ కరీంనగర్ లో ఇలా వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాడే అవకాశం లభించిందని ప్రియాంక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగీతం వల్ల ఏకాగ్రత, మానసిక ప్రశాంతత లభిస్తాయని తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయాలని ఆమె కోరుతున్నారు.