Karimnagar News: కరీంనగర్ జిల్లాలో పత్తి అమ్మకం - కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా జమ్మికుంట మార్కెట్లో మొదటి నుంచి ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉంది. దీంతో సీసీఐ కొనుగోలు చేయకుండా మిన్నకుంది. అయితే తాజాగా సీసీఐ పత్తిని వాణిజ్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లు సీసీఐ కేంద్రాల్లో పత్తిని ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికి వాణిజ్య కొనుగోళ్లకు మార్కెటింగ్ శాఖ నుంచి సీసీఐ అనుమతి పొందింది.


 వాణిజ్య కొనుగోళ్లు చేపడితే ధరలు మరింత పెరిగే అవకాశం


తాజాగా మంగళవారం ఆదిలాబాద్ లోని మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు సీసీఐ రంగంలోకి దిగింది. అయితే ప్రైవేటు వ్యాపారుల కంటే సీసీఐ కేవలం రూ.10 రూపాయలు మాత్రమే ఎక్కువగా నిర్ణయించడంతో రైతులు అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పారు. సీసీఐ అన్ని మార్కెట్లలో వాణిజ్య కొనుగోలు చేపడితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వరంగల్ రీజనల్ పరిధిలో పత్తి కొనుగోలు జరిగే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో పత్తి విక్రయాలు జరిగే 20 ప్రాంతాల మార్కెట్లలో పత్తిని దశల వారీగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొనుగోళ్లకు ఆయా ప్రాంతాల్లో బాధ్యులు, సిబ్బందిని నియామకం అవసరమైన ప్రాంతాల్లో జిన్నింగ్ కోసం మిల్లులను తీసుకోవాల్సి ఉంటుంది. 


డబ్బులు ఆలస్యంగా వస్తాయనే అభిప్రాయం..


కొనుగోళ్లకు సంబంధించి నిబంధనలను సీసీఐ ప్రకటించాల్సి ఉంది. మార్కెట్ యార్డులు లీజుకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులోను సీసీఐ పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని వరంగల్ జేడీఎం మల్లేశం తెలిపారు. పత్తి ధరలు తగ్గుదల బిడ్డింగ్ లో పోటీ తత్వం కొరవడి ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలు నిర్ణయించినా.. ప్రస్తుతం రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ధరల తగ్గుదలతో రైతులు మార్కెట్లకు తెచ్చే పత్తి కూడా తగ్గింది ధరలు పడిపోతున్న తర్వాత తరుణంలో సీసీఐ చేపడితే ప్రైవేట్ కాపర్లతో పోటీపడుతుంది. ఈ క్రమంలో బిల్డింగ్ లో ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే సీసీఐకి పత్తి విక్రయిస్తే డబ్బులు ఆలస్యంగా వస్తాయని అభిప్రాయం రైతుల్లో ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో  2,14,651 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరానికి సుమారు 6 క్వింటాల వరకు పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 14,796 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు. రెండు నెలల్లో 35% పత్తి అమ్మకాలు జరిగాయని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సీసీఐ వాణిజ్య కొనుగోలు ప్రారంభమైతే ధర ఎక్కువగా వస్తుందని రైతులు మార్కెట్కు పత్తి ని తేవడం పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు.