Karimnagar Cricketer Aman Rao : ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో కూడిన ఇండియన్ ప్రీమియర్‌లీగ్ వేలం ప్రపంచవ్యాప్తంగా క్రకెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. అటువంటి అత్యున్నత వేదికపై, తెలంగాణకు చెందిన ఓ కుగ్రామనికి చెందిన యువ క్రికెటర్‌కు స్థానం దక్కడం నిజంగా గర్వకారణం. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామానికి చెందిన పేరాల అమన్‌రావును ప్రతిష్టాత్మక రాజస్థాన్ రాయల్స్ జట్టు అమన్‌రావును 3లక్షలకు కొనుగోలు చేసింది. తద్వార అతనికి ఐపీఎల్ ప్రయాణానికి మార్గం సుగమమైంది.
కరీంనగర్ నుంచి మొదటి ఐపీఎల్ వారియర్
జిల్లాకు చెందిన ఒక యువకుడు మొట్టమొదటిారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపిక కావడం అనేది కరీంనగర్ క్రీడాభిమానులకు, స్థానిక యువ క్రీడాకారులకు ఒక స్ఫూర్తిదాయక పరిణామం. ఈ ఎంపికను జిల్లా వాసులు, క్రీడాసంఘాలు హర్షిస్తున్నాయి. పేరాల అమన్‌రావు అద్భుత నైపుణ్యం, స్థిరమైన ప్రదర్శన వల్లే ఐపీల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించగలిగాడు.
అమన్‌రావు ఆటతీరును పరిశీలిస్తే, అతను టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. అంటే ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే సామర్థ్యం అతనికి పుష్కంగా ఉంది. ఐపీఎల్‌లో ఇలాంటి దూకుు ప్రదర్శించే బ్యాట్స్‌మెన్‌కు అత్యంత డిమాండ్ ఉంటుంది. అతని బ్యాటింగ్ నైపుణ్యం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిభకు నిదర్శనం- హెచ్‌సీఏ నుంచి ఐపీ వరకు
ఐపీఎల్‌లో స్థానం దక్కడానికి ముందు అమన్‌రావు అసాధాణమైన క్రికెట్ అనువాన్ని సంపాదించుకున్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వివిధ స్థాయిల్లో ఆడాడు. ముఖ్యంగా అండర్ -19, అండర్‌్-23 విభాగాల్లో పేరాల అమన్‌రావు ప్రదర్శించిన నైపుణ్యం, స్థిరత్వం ఐపీఎల్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యువ ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్తించి ప్రోత్సహించడం అనేది దేశీయ క్రికెట్‌కు పునాదిని బలోపేతం చేస్తుంది. అమన్‌రావు ప్రయాణం, ప్రాంతీయ స్థాయి క్రికెట్ ఎంత కీలకమో మరోసారి రుజువు అయ్యింది.
పాస్‌పోర్ట్ లేదని తెలుసుకున్న కేంద్రమంత్రి....
ఐపీఎల్‌లో ఎంపికైన పేరాల అమన్‌రావుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఐపీెల్ వేలంలో పాల్గొనడానికి, అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత కీలకమైన పాస్‌పోర్ట్ అమన్‌రావుకు లేదు. దీని వల్ల వేలంకు వెళ్లలేకపోతానేమో అనుకున్నాడు. కానీ పరిస్థితి గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ స్పందించారు. యువ క్రీడాకారుడి భవిష్యత్, జిల్లా కీర్తి ప్రతిష్టలు ముడిపడిన విషయంలో మంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారు. మంత్రి జోక్యంతో, అప్పటికప్పుడు వేగవంతమైన ప్రక్రియ ద్వారా అమన్‌రావుకు పాస్‌పోర్టు జారీ చేయించారు.