Jagtial MLA Sanjay Kumar | జగిత్యాల జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. లోకల్ పాలిటిక్స్ ట్విస్ట్ హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులను మచ్చిగ చేసుకునే పనిలో పడ్డారు. అటు బీఆర్ఎస్ కేడర్ తనకు దూరమవ్వకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం గులాబీ దళానికి షాక్ ఇస్తే ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వర్గీయులు చేస్తున్న హడావుడితో కాక పుట్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో అందరూ సంజయ్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడని అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా తనదైన శైలిలో సంజయ్ చేస్తున్న రాజకీయ చాణిక్యం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.


కాంగ్రెస్ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh of Congress) తో హస్తం గూటికి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్ ఆసక్తికరంగా మారింది. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ స్థానిక లీడర్లు వ్యతిరేకించడంతో ఆ పార్టీలో సంజయ్ కొనసాగడం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో డాక్టర్ సంజయ్‌ను ఢీకొట్టి ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా హెచ్చరిక కాంగ్రెస్ లో కాక పుట్టించింది. పార్టీ బుజ్జగింపులతో మెత్తబడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో పెద్దపీట వేయనన్నారని, కేంద్రం పెద్దలు సైతం అందుకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాన్ని గందరగోళానికి గురిచేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోణంలో పార్టీ మారిన మళ్లీ జీవన్ రెడ్డి డామినేషన్ చేసే స్థితిలో ఉంటే తమ నాయకుడి ప్రభావం తగ్గింపు అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు సంజయ్ వర్గీయులు.


రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సంజయ్ కుమార్ 
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో వీడిన ఎమ్మెల్యేపై ఆ పార్టీ నాయకులతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంజయ్ కుమార్ ను కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు ప్లేటు ఫిరాయించడాన్ని గులాబీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతోంది. పైగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కోసం తన ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో ప్రకటించిన సంజయ్ ఇంత సడెన్‌గా పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఊహించలేదు. కానీ ఎమ్మెల్యే ఆకస్మిక నిర్ణయంతో బరిలోకి దిగిన బీఆర్ఎస్  హై కమాండ్ ఎమ్మెల్యే వెంట కార్యకర్తలు వెళ్లకుండా ప్రయత్నాలు చేశారు. గమనించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన మార్క్ పాలిటిక్స్ తో జగిత్యాలలో ఎంట్రీ ఇవ్వడం మొత్తం హైలెట్ గా మారింది. ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించిన కాంగ్రెస్ క్యాడర్ను పార్టీ వీడిన సంజయ్ను ఆగ్రహంతో  ఉన్న గులాబీ దళాన్ని చాకచక్యంగా తన దారిలోకి తెచ్చుకున్నారు సంజయ్.


బండి సంజయ్‌కు అపూర్వ స్వాగతం 
పార్టీ మారిన తరువాత మొదటిసారిగా జగిత్యాలలో అడుగుపెట్టిన సంజయ్ కుమార్ కు ఎవరు ఊహించని విధంగా అపూర్వ స్వాగతం లభించింది. రెండు పార్టీల నుంచి భారీగా చేరుకున్న కార్యకర్తలు ఎమ్మెల్యేకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల కిందట పార్టీ మారిన సంజయ్ రెండు పార్టీల క్యాడర్ను ఆకర్షించి తన దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు. సంజయ్ కుమార్ పార్టీని వీడడంతో కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు జగిత్యాలను పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్. 
ఎమ్మెల్యే వెళ్లినా నష్టం లేదని పార్టీ క్యాడర్‌ను ఎమ్మెల్యే టచ్ చేయలేరని కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కేటీఆర్ మీటింగ్ కు కేవలం ఇద్దరే బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కావడం మిగిలిన 20 మందికి పైగా కౌన్సిలర్లు జగిత్యాలలో అడుగుపెట్టిన డాక్టర్ సంజయ్ కి స్వాగతం పలకడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధులు పార్టీలను పక్కనపెట్టి సంజయ్ పక్కన చేరడంతో టిఆర్ఎస్ వర్గాలు షాక్ తిన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైఖరితో ఎమ్మెల్యే సంజయ్ను జగిత్యాలలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠ విడిపోయింది. 


ఆ పార్టీ క్యాడర్ సైతం భారీ సంఖ్యలో తరలిరావడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ఇటు జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి చేయాలని చూడడంతో పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఎమ్మెల్యే ఇబ్బందులు పడతారని అంతా అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యం ముఖ్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకొని పద్మ వ్యూహాన్ని ఛేదించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.