CPGET 2024 Halltickets Download: తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) -2023’ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, పరీక్ష పేపరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి 15 మధ్య సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.


అయితే మొదట జులై 6 నుంచి 9 వరకు జరిగే పరీక్షల హాల్‌టికెట్లను మాత్రమే అధికారులు విడుదల చేశారు. మిగతా పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను తర్వాత విడుదల చేయనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.230 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


సీపీగెట్ 2024 హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cpget.tsche.ac.in/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే  'Download Hall Ticket From 06-07-2024 To 09-07-2024 Examination Dates' లింక్ మీద క్లిక్ చేయాలి.


➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, పరీక్ష పేపరు వివరాలు నమోదుచేసి 'Download Hallticket' బటన్ మీద క్లిక్ చేయాలి.


➥ వివరాలు సమర్పించగానే అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


➥ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


➥ పరీక్షరోజు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాలి.


CPGET 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.


ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎ-లో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్-బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.



 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘సీపీగెట్‌ -2024’ నోటిఫికేషన్‌ మే 15న విడుదలైన సంగతి తెలిసిందే. మే 18 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ జులై 3న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి 16 వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. సీపీగెట్ పరిధిలోని 294 కళాశాలల ద్వారా మొత్తం 51 పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 47 పీజీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు.. కాక‌తీయ‌ యూనివర్సిటీ, పాల‌మూరు యూనివర్సిటీ, మ‌హాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహ‌న‌ యూనివర్సిటీ, తెలంగాణ‌ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...