Paripoornanda Swami Sensational Comments - జగిత్యాల జిల్లా : జగిత్యాల వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఆచారాలు విలువైనవి మాత్రమే కాదు, విజ్ఞానాన్ని అందిస్తున్నాయన్నారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులు ఇవ్వాలన్నారు. దేశంలో హిందువుగా జీవించే వారికి, హిందువు కాకపోయినా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మాన్ని గౌరవించని వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు వెళ్లిపోండి, లేకపోతే పారిపోండి అంటూ ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము సూచించిన విధంగా ఆధార్ ఇచ్చిన వాళ్లకు, హిందూత్వాన్ని గౌరవించే వాళ్లకు కళ్లు మూసుకుని ప్రజలు ఓట్లు గుద్దుతారు అని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు హిందూవులకు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆధార్ ఇవ్వలన్న అంశం అమలు కోసం కృషి చేయాలన్నారు. అయితే పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్లకు ఓట్లు వేద్దామనే వ్యాఖ్యలు సైతం రాజకీయ రంగు పులుముకున్నాయి.
పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యల వీడియో ఇదే..
పరిపూర్ణానంద స్వామి ఏమన్నారంటే..
మనం ఏ ఆచారాలు పాటిస్తున్నా ఈరోజు ప్రపంచ దేశాలకు మన దేశంలో చేసే హిందూ ఆచారాలు కేవలం విలువైనవి మాత్రమే కాదు. విజ్ఞానంగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. కనుక దేశంలో హిందుత్వం ఇంకా మెరుగ్గా నిలవాంటే పార్లమెంట్ లో గానీ, అసెంబ్లీలోగానీ నేతలు మొత్తం ఓ పని చేయాలని సూచించారు. దేశంలో ఇద్దరికే ఆధార్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఒకటి హిందువుగా జీవించే వారికి, హిందువులను గౌరవించే వారికి ఆధార్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మిగతా వాళ్లు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు పారిపోవాలని స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిగతావారి ఆధార్ కార్డులు తీసివేయాలని నేతలకు స్వామి సూచనలు
హిందువులకు, హిందువులను గౌరవించే వారికి ఎవరైతే ఆధార్ కార్డులు ఇవ్వాలన్నారు. మిగతావారి ఆధార్ కార్డులు తీసివేయాలన్నారు. ఇలాంటి పనిచేసే వాళ్లు ఎవరైనా వారికే కళ్లు మూసుకుని మనమంతా ఓట్లు వేసేద్దాం, అప్పుడే హిందూ ధర్మం నిలుస్తుందని అని పిలుపునిచ్చారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉందాం. లేకపోతే నసుగుతూ కూర్చుంటే ప్రయోజనం లేదన్నారు. ఈ దేశంలో ఉత్తరాదిన పుట్టిన రాముడు (SriRama Born In North India), దక్షిణాదిన పుట్టిన హనుమంతుడి సహకారం తీసుకున్నారు. అంటే ఉత్తరాధి వాళ్లు దక్షిణాది వాళ్ల సహకారం తీసుకుంటేనే విజయం సాధ్యమైందని గుర్తించాలన్నారు.
హనుమంతుడితో సహా అయోధ్యకు వెళ్లి శ్రీరామ పట్టాభిషేకం
దక్షిణ భారతంలో పుట్టిన ఆంజనేయుడి (Lord Hanuman Born In South India) సహాయం ఉత్తరాదిన పుట్టిన రాముడు తీసుకున్నాడు కనుకే.. ఆయన మళ్లీ సీతమ్మను తీసుకుని అయోధ్యకు వెళ్లి హనుమంతుడితో సహా అక్కడికి వెళ్లి పట్టాభిషేకం చేసుకున్నారని పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు. దేశంలో ఉత్తరం ఎంత గొప్పదో, దక్షిణ భారతం సైతం అంతే గొప్పదని ఉత్తరాధి నాయకులు గుర్తుంచుకోవాలని, ప్రాంతాల మధ్య తారతమ్యాలు చూపించకూడదని సూచించారు.