తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తుది పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 6న అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించే తుది పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 


ఏదైనా కారణంతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకపోతే support@tslprb.inకు మెయిల్ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని నియామక మండలి ఛైర్మన్ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ4 సైజ్ కాగితంపై ప్రింట్ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలని సూచించారు. ఫొటో గుర్తింపులేని వారిని అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా... వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందని ఛైర్మన్ వెల్లడించారు. ఈ పరీక్షలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో నిర్వహించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



పోలీస్ ఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇలా...
➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు. 


Also Read:


ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...