Fact Check : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట ఏ వేడుక జరిగినా బాలీవుడ్ తారలంతా హాజరవుతారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఇలాంటి ఓ భారీ విందు ఇచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ స్వీట్ లాంటి వంటక. ఆ స్వీటుతో పాటు కరెన్సీ నోట్లు ఉంచారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టిష్యూ పేపర్లకు బదులుగా రూ. ఐదు వందల నోట్లు ఉంచారన్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభమయింది.
నిజానికి ఇలా నోట్లు ఉంచే వంటకం నార్త్ ఇండియాలో పాపులర్. దీన్ని దౌలత్ కి చాట్.. ఈ స్పెషల్ మెనూ ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో కేవలం శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగు, పిస్తా, కోవా, చక్కెర పొడితో ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దాంతో ఈ వంటకం చాలా పాపులర్ అయ్యింది. ఇక ఈ వంటకమే అంబానీ పార్టీలో కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
అయితే ఇవి అసలు నోట్లా .. ఉరకనే అలా షో కోసం చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు ఏమైనా పెట్టారా అ్న సందేహాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలోని "ఇండియన్ యాక్సెంట్" అనే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ లో ఫేమస్ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో ట్విట్టర్ లో షేర్ అవుతోన్న పోస్ట్.. కేవలం రూమర్ అని స్పష్టమవుతోంది. కానీ ముందు ట్వీట్ చూసిన వారంతా నిజంగానే అంబానీల పార్టీల్లో టిష్యూ పేపర్లకు బదులు రూ.500నోట్లను వడ్డించారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అంబానీలు అపర కుబేరులే కానీ.. డబ్బు విలువ వారికి తెలుసని.. ఇలా డబ్బుల్ని టిష్యూ పేపర్లుగా వాడబోరని కొంత మంది అంటున్నారు. అయితే ఈ అంశంఫై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం విసృతంగా ప్రచారం జరుగుతోంది.