Jilebi Business In Jagityala: కరీంనగర్/జగిత్యాల: మీరు ఎప్పుడైనా జగిత్యాలకి వెళ్లారా... వెళ్తే ఈసారి అక్కడే టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నటువంటి హర్యానా జిలేబీ మాత్రం తప్పకుండా రుచి చూడాల్సిందే. దాదాపుగా 25 సంవత్సరాలుగా జగిత్యాల వాసులకు రుచికరమైన వేడి వేడి జిలేబీ అందిస్తున్నారు ఓ వ్యక్తి. ఈ స్వీట్ సెంటర్ పై స్పెషల్ స్టోరీ మీకోసం...


ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామ్ శ్రవణ్. దాదాపుగా 25 సంవత్సరాల కిందటరాజస్థాన్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన జిలేబీలు అద్భుతంగా చేయగలడు. వేడి వేడి పానకాన్ని తయారుచేసి అందులో రెడీగా ఉంచిన పిండిని సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తున్నారు. ఆ తర్వాత వెంటనే తీసి పానకంలో నానబెడతారు. దీంతో కొద్ది క్షణాల్లోనే నోరూరించే హర్యానా స్పెషల్ జిలేబీ రెడీ అవుతుంది. 


తాను దాదాపు పాతికేళ్ల కిందటే రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వలస వచ్చానని చెప్పారు. ఇక్కడ మొదలు పెట్టిన ఈ చిన్న స్వీట్ షాప్ తోనే నడిపిస్తున్నానని గతంలో నెలకు కిలోల కొద్దీ అమ్మిన తాను ఇప్పుడు క్వింటాళ్లలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ బిజినెస్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు క్వాలిటీలో ఏ మాత్రం తేడా రాకుండా ఉండడంతో శుభకార్యాలకు, పెద్ద పెద్ద ఫంక్షన్‌లకు సైతం భారీ ఎత్తున ఆర్డర్లు వస్తుంటాయని నిర్వాహకుడు రామ్ శ్రవణ్ తెలిపారు. అయితే తాను అనవసర ఖర్చులకు పోకుండా ఇదే చిన్న షాపులోనే ఈ జిలేబీ తయారు చేస్తానని పేర్కొన్నారు.


చిన్నప్పటి నుంచీ స్వీట్ స్వీట్‌గా..
చిన్నప్పటి నుంచి తనకు ఈ షాప్ పరిచయమని.... ఇక్కడ అద్భుతమైన క్వాలిటీతో కూడిన జిలేబి ఉంటుందని స్థానిక యువకులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా క్వాలిటీ లో తేడా రాలేదని అందుకే  మామూలు సమయాల్లో సైతం తాము ఇలా వచ్చి ఓ పట్టు పడుతుంటామని అంటున్నారు. జగిత్యాల వాసులు సహజంగానే ఫుడ్డీలు అని... తమకి ఏ టైం లో వచ్చినా వేడి వేడిగా అందించే జిలేబీ.. మంచి ఎనీ టైం స్నాక్ గా మారిందని స్థానికులు చెబుతున్నారు.


కాస్త పేరు రాగానే హై ఫై కి వెళ్లి ఆర్ధికంగా గిట్టుబాటు కాక క్వాలిటీలో తేడా వచ్చేలా చేసుకుంటారు చాలా ఫుడ్ సెంటర్ నిర్వామకులు.. కానీ ఇది సరైంది కాదంటారు రాం శ్రవణ్. తయారీ ఖర్చు ఎంత తక్కువగా ఉంటే కస్టమర్ కి అంత క్వాలిటీ  ఇవ్వగలుగుతామని... ఇదే తన బిజినెస్ సీక్రెట్ అంటున్నారు. ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలకు ఇప్పటికి అతి తక్కువగా 10 రూపాయల్లో కూడా ఇవ్వగలుగుతున్నానంటే అదే కారణమని గర్వంగా చెబుతున్నారు.
Also Read: Oats Pakora Recipe: సాయంత్రం వేళ క్రిస్పీగా ఓట్స్ పకోడీ, చిటికెలో చేసేయచ్చు