ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఐదు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు జనజీవనం ఇబ్బంది పడుతోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తెలంగాణలో వాతావరణంపై రాత్రి 1 గంటకు ఐఎండీ ప్రత్యేక బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లా, కామారెడ్డి, కుమ్రంభీమ్ మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భవనగిరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే పడి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరిసరాల్లో పడుతున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రవాహం 48 అడుగులు దాటితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
వివిధ ప్రాజెక్టల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...
గోదావరి బేసిన్‌లో ఉన్న సింగూరులో పూర్తి స్థాయి నీటి మట్టం 1717.93 అడుగులు ఉంటే ప్రస్తుతం 1709.53అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 19.25 టీఎంసీల నీరు ఉంది. సింగూరుకు 8,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 385 క్యూసెక్కులను నీటిని బయటకు వదులుతున్నారు.
నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం 1388.03 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.8 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 4.39 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 23,400 క్యూసెక్కులు ఉంటే బయటకు ఇంకా నీటిని విడుదల చేయడం లేదు.
శ్రీరాం సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం -1091 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 1070.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు - ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 38.95 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 59,165 ఉంది. ప్రస్తుతానికి నీటిని బయటకు వదలడం లేదు.
మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -1043.31 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం -1025.69 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -27.50 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.72 టీఎంసీలు
ఇన్‌ఫ్లో - 4590 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో- 1700 క్యూసెక్కులు
లోయర్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -920 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం -896.35 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -24.07టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --8.55 టీఎంసీలు
ఇన్‌ఫ్లో - 1522 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో-226క్యూసెక్కులు
కడెం పూర్తిస్థాయి నీటి మట్టం -700అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం -694.700 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -7.6 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --5.66టీఎంసీలు
ఇన్‌ఫ్లో - 16,1800క్యూసెక్కులు
అవుట్ ఫ్లో- 104334క్యూసెక్కులు
9 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం -485.56 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం -478.94అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -20.18టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.96టీఎంసీలు
ఇన్‌ఫ్లో - 10,226క్యూసెక్కులు
అవుట్ ఫ్లో- 7559క్యూసెక్కులు
అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం సమ్మక్క బ్యారేజీ 8.76 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మేడిగడ్డబ్యారేజీకి 5.65 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ బ్యారేజీకి 9.57లక్షల క్యూసెక్కులుు, సుందిళ్ల బ్యారేజీకి 1296 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆయా ప్రాజెక్టుల్లో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.