Ponnam Prabhaker: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. భూ నిర్వాసితులతో అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను.. పొన్నం ప్రభాకర్ కు వివరించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ దేశ రాజధాని ఢిల్లీలో, ప్రముఖ నగరాల్లో పెట్టాలి కానీ.. ఖమ్మంలో పెట్టడం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశాడంటూ మండిపడ్డారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా పనులకు అడ్డు పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
"అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం లో పెట్టడం వెనుక ఉన్న మాథలబ్ ఏమిటి? రాష్ట్రం లో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త తెర తెరిచిండు. గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించ కుండా పనులకు అడ్డు పడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. కుర్చీ వేసుకుని కూర్చుండి ప్రాజెక్టు పూర్తి చేస్తా మన్న సీఎం 8 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు. మెట్ట ప్రాంత మైన హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ అసమర్దత వల్లే యాసంగి పంటకి నీళ్లు ఇవ్వడం లేదు. వివాహితులైన మహిళలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యల పరిస్కారం కోసం 100 రైతుల తో సీస్ శాంతి కుమారి కలిసి సమస్య వివరిస్తాం." - మాజీ పొన్నం ప్రభాకర్
ఎనిమిదేళ్లుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు..!
కుర్చీ వేసుకుని కూర్చుండి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న సీఎం 8 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ ప్రాంత రైతులకు కేసీఆర్ అసమర్దత వల్లే యాసంగి పంటకు నీళ్లు అందడం లేదని ఆరోపించారు. వివాహితులైన నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇచ్చి త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసిత మహిళల సమస్యల పరిస్కారం కోసం, వంద మంది భూ నిర్వాసిత మహిళలను సీఎస్ శాంత కుమారి వద్దకు తీసుకెళ్లి ఆమెకు సమస్యను వివరిస్తామన్నారు.