Boga Shravani resigned from BRS party :  జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.  BRS పార్టీ సభ్యత్వనికి , వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్  భోగ శ్రావణి. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై సంచలన వాఖ్యలు చేసి మున్సిపల్ చైర్మన్ పదవి కి రాజీనామా చేసిన భోగ శ్రావణి ఈ రోజు పార్టీ కి రాజీనామా చేస్తున్నానని రాజీనామా పత్రాన్ని జిల్లా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి పంపుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఆశీర్వాదంతోనే బి ఆర్ ఎస్ పార్టీలోకి వచ్చానని ఇన్ని రోజులు సహకరించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి KTR ల కు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే సంజయ్ స్వార్ధపూరిత కుట్రల కు బీసీ మహిళా బలి అయ్యిందని అందుకే ఆత్మాభిమానం కోసమే మున్సిపల్ పదవికి రాజీనామా చేశానన్నారు. కవిత అనుచరులను పార్టీ కి దూరం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం అని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓటమికి కి మొదటి కారణం తానే అవుతానని బోగ శ్రావణి చాలెంజ్ చేశారు.  రాజీనామా చేసినప్పటి నుంచి పార్టీ నుండి నాకు ఎలాంటి సహకారం లేదని అందుకే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 
 
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి జనవరి 25న రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే  సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా  ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు  సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు.
 
మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బులు కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పామమని అయినా వదిలి పెట్టలేదన్నారు భోగ శ్రావణి. దొర అహంకారం తో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉందని..  నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాననన్నారు. స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని.. మూడు సంవత్సరాలనుండి నరకం అనుభవిస్తున్నానని ఆమె విలపించారు.  


కమిషనర్ ను బెదిరించి సస్పెండ్ చేస్తాను అని బెదిరించడం తోనే ఆయన లీవ్ పై వెళ్లిన మాట వాస్తవం కాదా అని భోగ శ్రావణి ప్రశ్నించారు. ఎమ్మెల్యే అడ్డు పడ్డా అభివృద్ధి వైపే ఉన్నామన్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని..  తన కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు.  తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఇప్పుడు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారన్నదానిపైస్పష్టత లేదు.