‘కరీంనగర్ నగర్ గడ్డపై గర్జించి, గాండ్రిస్తే బీఆర్ఎస్ వాళ్ళకి వణుకు పుట్టాలి. నిన్ననే ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించిన వాళ్లకి మనమేంటో కూడా తెలియాలి కదా. ఇంకొకరికి కొమ్ముకాసే అలవాటు నాకు లేదు. ధర్మానికి, సమాజానికి తలదించే పని ఎప్పటికీ చేయను’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్  మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తాను ముందు ఈ డివిజన్ కార్పొరేటర్ ను అయ్యానని, ఆపై 2014 లో ఎమ్మెల్యేగా 47 వేల ఓట్లు వేశారని చెప్పారు. కరీంనగర్ గడ్డ నన్ను ధర్మం కోసం పనిచేయమందని, అందుకోసం 2018 లో ఎమ్మెల్యేగా 68 వేల ఓట్లు వచ్చాయన్నారు. అయితే తాను ఎందుకు ఒడిపోయాడో కరీంనగర్ ప్రజలకు తెలుసునన్నారు. ఇంకొకరికి కొమ్ముకాసే అలవాటు నాకు లేదని, నా ధర్మానికి, సమాజానికి తలదించే పని ఎప్పటికీ చేయను. బండి సంజయ్ ఓడిపోతే కార్యకర్తలు ఏడుస్తున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు మీ కష్టార్జిత ఫలితంగా కరీంనగర్ ఎంపీగా గెలిచానని గుర్తుచేసుకున్నారు.

ఇద్దరు సీఎంలు దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఇప్పుడు BRS పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నారని కరీంనగర్ ఎంపీ ఆరోపించారు. దందాలు, కబ్జాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్.. ఇలా అన్ని దందాలు, స్కామ్ లు వాళ్ల కుటుంబానివే అంటూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి కి కేసీఆర్ సహకరించడం లేదని, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదన్నారు. ఉదయం లేచినప్పటినుంచి 24 గంటలు ప్రధాని మోదీని తిడుతూ... ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు రాష్ట్రాలను దోచుకోవాలని చూస్తున్నారని, ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.

‘మీ వల్లనే కరీంనగర్ లో పింక్ కలర్ జెండాను పాతిపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించాం. కరీంనగర్ గడ్డపై, ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే గెలిచాను. ఏ లక్ష్యంతో బీజేపీ అధిష్టానం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందో అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను. మీ కోసమే పాదయాత్ర చేస్తున్న. పచ్చ జెండాను, పింక్ జెండాను పీకేసి, కాషాయ జెండా ఎగరేయాలి. 2001లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ పెట్టిన సభకు కూడా ఇంతమంది రాలేదు. సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైంది?. తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణను తీసేసిండు కేసీఆర్. తెలంగాణతో బంధం తొలగించుకున్నాడు. దాంతో మనకు కేసీఆర్ పీడ విరగడయింది’ అన్నారు బండి సంజయ్.

‘ఇక్కడ ఎంతమందికి 2bhk లు వచ్చాయి?. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం. ఈ 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలే. సీఎం కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు. తాజాగా 1.46 వేల ఉద్యోగాలు కేంద్ర సర్కారీ కొలువులు ప్రధాని మోదీ ఇచ్చారు. తెలంగాణలో చూస్తే.. విద్యా వ్యవస్థను నాశనమైంది. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేరు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? వద్దా?. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చారు. మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని’ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మోడీ సింహం... సింగిల్ గానే వస్తారు
ప్రధాని మోదీ ఎప్పటికీ సింహమేనని, ఆయన ఎన్నికలకు సింగిల్ గానే వస్తారన్నారు. తన పాదయాత్ర ద్వారానే 8 సంవత్సరాలు ఫామ్ హౌజ్ లో పండుకున్న కేసీఆర్, ఇప్పుడు బీజేపీకి భయపడి బయటికొచ్చిండన్నారు. TRS పార్టీ దుకాణం మూసేసి, ఢిల్లీలో బీఆర్ఎస్ దుకాణం తెరిచిండని ఎద్దేవా చేశారు. BRS అంటే... బంధిపోట్ల రాష్ట్ర సమితి, బార్ & రెస్టారెంట్ సమితి అని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ భరతం పడతామన్నారు బండి సంజయ్.