Bandi Sanjay Kumar: తెలంగాణ వ్యాప్తంగా"ఇంటింటికి బీజేపీ" కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని బూత్ స్థాయి కార్యకర్తల నుంచి జాతీయ నాయకుల వరకు బీజేపీ నాయకులంతా వారి వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ.. కేంద్రంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తారు.


కేంద్రం తీసుకున్న చర్యలను వివరిస్తూనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి గురించి కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ 9 సంవత్సరాల పాలన విజయాలను వివరిస్తూ కరపత్రాల పంచుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే కరీంనగర్ 57వ డివిజన్ 173వ పోలింగ్ బూత్‌లో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు స్వయంగా ఆయనే వివరించారు. ప్రధానికి మద్దతు ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ 909090 2024కు మిస్డ్ కాల్ ఇవ్వాలని బండి సంజయ్ ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే ప్రజలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.