Bandi Sanjay: మీ అయ్యను తీసుకురా, నేను ఓడితే రాజకీయ సన్యాసమే - బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

ABP Desam   |  07 Mar 2024 10:30 PM (IST)

Telangana News: ప్రజాహిత యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం చొప్పదండి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కేటీఆర్ సవాలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

బండి సంజయ్

Bandi Sanjay Challenges KTR in Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధమా? అంటూ మాజీమంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ అభివ్రుద్ధితోపాటు తాను చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కరీంనగర్ కమాన్ వేదికగా చర్చించేందుకు సిద్ధమన్నారు. తనతో చర్చించేందుకు కేసీఆర్ ను తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు. 

‘‘కరీంనగర్ కు నేను చేసిన అభివ్రుద్ధితోపాటు రాముడి అంశంపైనా ఎన్నికల్లోకి వెళుతున్నా... నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఓడిపోతే హిందుత్వం, బీజేపీ గురించి మాట్లాడను. మరి నేను గెలిస్తే... బీఆర్ఎస్ పార్టీని మూసేసి ఫాంహౌజ్ కే పరిమితమైతారా?’’అటూ సవాల్ సంధించారు. రాముడి పేరు చెప్పుకుని ఆనాడు ఎన్టీఆర్ వద్ద ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించిన  మీ అయ్య అదే రాముడి పేరున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై తన గురించి మాట్లాడేటప్పుడు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని, అడ్డగోలుగా మాట్లాడితే కరీంనగర్ లో అడుగు కూడా పెట్టనీయబోమని వార్నింగ్ ఇచ్చారు. 

 ప్రజాహిత యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం చొప్పదండి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలు చల్లి, పటాకులు పేల్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున ఎదురేగి మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో పాదయీత్ర చేసిన బండి సంజయ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘నీ బతుకు ఎందో చెప్పు,అమెరికాలో చిప్పలు కడిగిన నువ్వు నన్ను విమర్శిస్తావా కేటీఅర్. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు. ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకుంటే పేరు మార్చి నందమూరి తారక రామారావు అని పేరు  పెట్టిండు. పేరు పెట్టకుంటే మీ అయ్యకు టికెట్ వచ్చేదా కేటీఆర్? బరా బర్ రాముడి పేరు చెప్పుకొని కరీంనగర్ పార్లమెంటు అభ్యర్ధిగా వస్తున్న. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కి ఏం రోగం వచ్చింది అక్క.. నన్ను తిట్టి పోయిండు. కండకావరం, అహంకారం తలకెక్కి కేటిఅర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు

రాముడిని వ్యతిరేకించే బీఆర్ఎస్ ,కాంగ్రెస్  నేతలకు చెప్తున్న.. చనిపోతా అని తెలిసిన కూడా అయోధ్య కి పోయి కట్టడాన్ని కూల్చిన వ్యక్తిని నేను. రాముడి గుడి కట్టడం కోసం వందల మంది కార్యకర్తలు చనిపోయారు. దేవుడిని నమ్మని సన్నాసి కేటీఆర్. రాముడి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పోయి ఆలయాల అభివృద్ధి చేస్తా అని కేసీఆర్ మోసం చేసిన విషయాన్ని మర్చిపోకు కేటీఆర్.- బండి సంజయ్

Published at: 07 Mar 2024 10:30 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.