పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు(ALP) గనిలో ప్రమాదం జరిగింది. 85 లెవెల్ వద్ద పైకప్పు కూలింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గని ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒకరు అసిస్టెంట్ మేనేజర్, ఐదుగురు కార్మికులు. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే సింగరేణి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
సింగరేణి రామగుండంలో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారనే విషయం తెలిసినవెంటనే సిఎం కెసిఆర్ ఆరా తీశారు.
ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను సిఎం ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ప్రమాద తీవ్ర పెరగకుండా రక్షణ చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్‌కు అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చినట్టు సిఎం కెసిఆర్ కు సింగరేణి ఎండీ వివరించారు.