కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మినరసింహారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అనుచరులతో కలిసి వచ్చి పార్టీలో చేరారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్ పార్టీతో రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న లక్ష్మీ నరసింహారావుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. దేశంలో తెలంగాణ జనాభా 2.5 శాతం అయితే.. 5 శాతం జీడీపీ ని దేశానికి సమకూరుస్తున్నామని.. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువన్నారు. దేశానికి సంపద అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు.


Also Read : కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?


ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలు కడుపులో పేగులు తెగే దాకా కొట్లాడారని.. కాంగ్రెస్, బీజేపీలు ఎంపీలు కొట్లాడకున్న టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారని..వాళ్లు మనుషులా పశువులా అని ప్రశ్నించారు.  మేము జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకేనని సోనియాగాంధీ కి మోడీకి భయపడేవాడు ఇక్కడ ఎవ్వడూ లేడని కేసీఆర్ స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ చీప్‌గా మాట్లాడుతున్నాడని రూ. 50 కోట్ల లంచమిచ్చి పదవి తెచ్చుకున్నారని కాంగ్రెస్ నాయకులే ఆరోపించారన్నారు.  ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పడం వల్లే సమస్యలు వచ్చాయన్నారు. అరెస్టులు చేస్తామని భయపెడితే ఎవరూ భయపడిపోరని తేల్చేశారు.


Also Read : రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..


 కేటీఆర్‌ను ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహారావు. 50ఏళ్లలో చేయాల్సిన పనులు కేసీఆర్ ఐదేళ్లలో చేసి చూపించారని..తెలంగాణ చరిత్రలో ఫ్లోరెడ్ ఇక పోవడం అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారన్నారు. రాజకీయ లబ్ధికోసం టీఆర్ఎస్‌లో చేరలేదని కాంగ్రేస్ పార్టీకి నాయకత్వం లేదు ఉన్న నేతల మధ్య సమన్వయం లేదని తెలంగాణ రాష్ట్రానికి దశ- దిశ టీఆరెస్ మాత్రమనన్నారు.


Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?


మంత్రి గంగుల కమలాకర్‌తో తనకు ఎలాంటి వివాదాలు లేవని.. ఎన్నికల్లో మాత్రమే ఇన్ని రోజులు మాకు పోటీ అని.. ఎన్నికలు మినహాయిస్తే మేమంతా స్నేహితులమేనని ఆయన స్పష్టం చేశారు.  లక్ష్మినరసింహారావు చేరిక తనకు ఇష్టంలేదని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గంగుల కమలాకర్ ఖండించారు. రాబోయే కాలంలో కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పెద్దసారు అవుతారుని జోస్యం చెప్పారు. తలతెగినా టీఆరెస్ పార్టీ జెండా వదలమని..మనమంతా సూసైడ్ స్క్వాడ్ గా పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.


Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి