అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి కరాటే కల్యాణి హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాయలంలో విచారణకు హాజరయ్యారు. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా చైల్డ్ వేల్ఫేర్ ఆఫీసర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు లేకపోవడంతో మరోసారి బుధవారం మరోసారి హాజరు కావాల్సి ఉంది.  తనపై ఆరోపణలు రావడంతో విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి వచ్చానని తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. 


కలెక్టర్‌ను కలిసి దత్తత వ్యవహారంపై వివరణ ఇచ్చినట్టు మీడియాకు కల్యాణి తెిలపారు. తెలిపారు. 5 నెలల చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని, కానీ దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడింది నిజమేనని వివరించారు. పలువురు తనను స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో అలా చెప్పినట్టు పేర్కొన్నారు. తనను కేసులో ఇరికించేందుకు కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  పాపను నేను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 


ఇదే విషయాన్ని కలెక్టర్‌ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ  కరాటే కల్యాణి చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్‌ లైన్‌ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు.  నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారి పాప తల్లిదండ్రులు కూడా ఇంకా ఎలాంటి దత్తత ఇవ్వలేదని తాము కూడా కల్యాణి ఇంట్లోనే ఉన్నామని ప్రకటించారు. అధికారులు లేకపోవడంతో బుధవారంలో విచారణ తరవాత కల్యాణి పెంచుకుంటున్న పాప అంశంపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


కాగా ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ అనే వ్యక్తికి, కరాటే కల్యాణికి నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ గొడవలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఎస్ఆర్‎నగర్ పోలీస్ స్టేషన్‎లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే గొడవ సమయంలో కరాటే కల్యాణి వద్ద 2 నెలల శిశువు ఉన్నారు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐతో కూడా వాగ్వాదానికి దిగారు. అప్పుడు కూడా పాప ఉన్నారు.  ఈ సమయంలో శివశక్తి అనే సంస్థ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.  లీగల్‌గా దత్తత తీసుకోకపోవడంతో సమస్యలు వచ్చాయి. చివరికి పాప తల్లిదండ్రులతో కలిసి ఈ సమస్య నుంచి బయటపడేందుకు కల్యాణి ప్రయత్నిస్తున్నారు.